బూస్ట‌ర్ డోస్‌పై భార‌త్ బ‌యోటెక్ కీల‌క వ్యాఖ్య‌లు…

క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు భారీగా పెరుగుతున్న వేళ భార‌త్ బ‌యోటెక్ ఫార్మా బూస్ట‌ర్ డోస్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  కోవాగ్జిన్ రెండో డోస్ తీసుకున్న ఆరు నెల‌ల త‌రువాత బూస్ట‌ర్ డోస్ తీసుకోవ‌డం ద్వారా వారిలో డెల్టాను నిలువ‌రించే యాంటాబాడీలు ఐదురెట్టు వృద్ధి చెందుతాయ‌ని భార‌త్ బ‌యోటెక్ తెలియ‌జేసింది.  అంతేకాదు, బూస్ట‌ర్ డోస్ తీవ్ర‌మైన వైర‌స్‌ను 90శాతం క‌ట్ట‌డి చేస్తుంద‌ని పేర్కొన్న‌ది.  బూస్ట‌ర్ డోసులు తీసుకున్నావారిలో టి, బి సెల్స్‌ను గుర్తించామ‌ని తెలియ‌జేసింది.

Read: బెంగ‌ళూరులో 10శాతం దాటిన పాజిటివిటీ రేటు…రికార్డ్ స్థాయిలో కేసులు…

భార‌త్ సొంత ప‌రిజ్ఞానంతో క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను త‌యారు చేసింది.  ఈ వ్యాక్సిన్‌ను దేశంలోని ప్ర‌జ‌ల‌కు కేంద్రం ఉచితంగా అందిస్తూ వ‌స్తున్న‌ది.  మాన‌వ‌తా హృద‌యంలో కోవాగ్జిన్‌ను ఇత‌ర దేశాల‌కు కూడా ఇండియా స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది.  15 నుంచి 18 ఏళ్ల చిన్నారుల‌కు అందించే టీకాను కూడా భార‌త్ బ‌యోటెక్ ఫార్మా త‌యారు చేసిన సంగ‌తి తెలిసిందే.  కాగా, బూస్ట‌ర్ డోస్‌ను జ‌న‌వ‌రి 10 వ తేదీ నుంచి ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నారు.  

Related Articles

Latest Articles