వీరుల త్యాగం తోనే స్వేచ్ఛ అనుభవిస్తున్నాం అన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. గుంటూరులో చారిత్రాత్మకమయిన జిన్నాటవర్ ని బీజేపీ వివాదాస్పదం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం ఉందని, సైనికుల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారన్నారు.
వివాదం సృష్టించడం సిగ్గు చేటు.జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన దేశ పాలకులు చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరం.జాతీయ స్థాయిలో పాలన చేస్తున్న బిజెపి కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.ఐక్యతతో ఉండటం కారణంగానే ప్రశాంతంగా ఉంటున్నాం.జాతీయ జెండా ఆవిష్కరించి మంచి ముగింపు ఇచ్చారన్నారు.