వీరుల త్యాగం తోనే స్వేచ్ఛ అనుభవిస్తున్నాం అన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. గుంటూరులో చారిత్రాత్మకమయిన జిన్నాటవర్ ని బీజేపీ వివాదాస్పదం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం ఉందని, సైనికుల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారన్నారు. వివాదం సృష్టించడం సిగ్గు చేటు.జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన దేశ పాలకులు చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరం.జాతీయ స్థాయిలో పాలన చేస్తున్న బిజెపి కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టాలని…
బీజేపీ నేతల తీరుపై గుంటూరు జిల్లా వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. ఐక్యత దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఐక్యత దెబ్బతీయాలనుకోవడం పెద్ద తప్పిదం. మత శక్తుల, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు జగన్ కు ధన్యవాదాలు అన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దు. జిన్నా దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. జిన్నా గొప్ప న్యాయవాది అన్నారు డొక్కా. ఎమ్మెల్యే మద్దాలి…
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. గుంటూరులో జిన్నా టవర్ అంశం ఇరు పార్టీ నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా మారింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. 2014–19 మధ్య రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించిన బీజేపీకి గుంటూరులో జిన్నా టవర్ ఉందని గుర్తుకు రాలేదు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరవాత,…