ఏపీలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడే అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పవర్ హాలిడే ఎత్తేయాలని లోకేష్ కోరారు. పవర్‌లో వున్న మీరు పవర్ హాలీడే ప్రకటించడం చాలా సులువే. కానీ ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర పరిస్థితి ఆలోచించారా? మొన్నటి వరకు కరోనా కష్టాలతో నష్టాల్లో నడిచిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కాస్త గాడినపడి పుంజుకుంటుంటే పవర్ హాలిడే…
కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఉదయం సమావేశం అయిన ఏపీ కేబినెట్ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేపింది. ఈ సందర్భంగా సోషియో ఎకనమిక్ సర్వే విడుదలయింది. ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ సోషియో ఎకనమిక్ సర్వే విడుదల చేశారు. దీని ప్రకారం జీఎస్డీపీ రూ. 12.01 కోట్లుగా ఉంది. ఏపీలో యాన్యువల్ గ్రోత్ రేట్ 18.47 శాతంగా ఉంది.కరోనా కారణంగా ఎలాంటి ప్రగతి లేదు.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది.…
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బూటకపు ప్రకటనలు చేయడాన్ని మంత్రి బుగ్గన కట్టిపెట్టాలన్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. మంత్రి బుగ్గన ఇంకెంత కాలం పిట్టకథలతో నెట్టుకొస్తారు..?ఓ రోజు కరోనా కారణంగా ఆదాయం తగ్గిందంటారు.. మరో రోజు కరోనా ఉన్నా ఆదాయం పెంచామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమెంత..? పెడుతున్న ఖర్చెంత..?మూలధన వ్యయం ఎక్కువగానే ఖర్చు పెట్టామని లెక్కలు చెబుతున్న బుగ్గన.. ఏ ప్రాజెక్టు ఎంతెంత ఖర్చు పెట్టారో చెప్పగలరా..?మరోసారి మాయలెక్కలను…
ఏపీలో ఉద్యోగుల రిటర్మైంట్ వయసుపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించానన్నారు సీఎం జగన్. ఈ ఉదయంకూడా మరోవిడత అధికారులతో మాట్లాడాను. నిన్న నేను 2–3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పాను. కానీ నిర్ణయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా చెప్తే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టాను. రాష్ట్ర…