ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది.. వారి కాపురం పదేళ్లు సాఫీగా సాగింది.. ఎంతో అన్యోనంగా ఉన్న వారి జంటకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ గత కొంతకాలంగా గొడవలు మొదలైయ్యాయి..చాలా సార్లు ఇద్దరికీ పెద్దలు పంచాయితీ పెట్టి మరీ సర్ది చెప్పారు.. అయితే మళ్లీ కొద్ది రోజులకు గొడవలు జరిగేవి..ఈ క్రమంలో భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య.. నిన్న రాత్రే అత్తగారింటికి వచ్చింది. ఏమైందో ఏమో కానీ.. అర్ధరాత్రి సమయంలో భార్య పక్కన పడుకున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. దీంతో అతను మరణించాడు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది..
Read Also:Tamannah Bhatia: బీచ్ ఒడ్డున డాన్స్ చేస్తూ… బాల్యాన్ని గుర్తుచేసుకున్న మిల్కీ బ్యూటీ !
వివారాల్లోకి వెళితే..అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై భార్య పెట్రోల్ పోసి నిప్పు పెట్టిందని.. దీంతో భర్తకు తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడని పోలీసులు తెలిపారు… ఈ ఘటన పూజారోల్లపల్లి గ్రామంలో జరిగింది..గ్రామానికి చెందిన శ్రీధర్ కు అదే గ్రామానికి చెందిన మమతను ఇచ్చి 17 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు.. శ్రీధర్ 15 ఏళ్లపాటు ఆర్మీలో సర్వీసు పూర్తి చేసి ఏడాది క్రితం గ్రామానికి తిరిగి వచ్చాడు. అనంతరం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో పెద్దలు పంచాయితీ చేశారు..
Read Also:Lifestyle : పెళ్లి తర్వాత మగవాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే అస్సలు గొడవలే రావు..
భర్తతో గొడవపడిన మమత ఇటీవల పుట్టింటికి వెళ్ళిపోయింది. నిన్న రాత్రి అత్తగారి ఇంటికి తిరిగి వచ్చిన మమత.. మళ్లీ శ్రీధర్ తో గొడవపడింది… ఇక కోపంతో రగిలి పోతున్న మమత అర్ద రాత్రి ఘాడ నిద్రలో ఉన్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. మంటల్లో చిక్కుకున్న శ్రీధర్ 80 శాతం గాయాలు అవ్వడంతో మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు ఆసుపత్రికి తరలించారు. ఈ లోపే శ్రీధర్ మృతిచెందాడు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీధర్ భార్య మమతను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మమత నేరాన్ని అంగీకరించింది. భర్త వేధింపులను తట్టుకోలేక ప్లాన్ ప్రకారమే చంపినట్లు చెప్పింది.. దాంతో ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..