Tamannah Bhatia: బీచ్ ఒడ్డున డాన్స్ చేస్తూ… బాల్యాన్ని గుర్తుచేసుకున్న మిల్కీ బ్యూటీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..తన అభినయంతో అందంతో తెలుగు రాష్ట్రల్లోనే కాదు నార్త్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో అందరి చూపును తనవైపు తిప్పకుంది.. ఆ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ లను అందుకుంటూ వస్తుంది.. ఇలా క్రేజ్ ను సంపాదించుకున్న తమ్ము ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు పూర్తి అవుతున్నా కూడా వరుస సినిమాలను చేస్తుంది..
ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా డ్యాన్స్ చేస్తున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఒకరు..అందుకే ఆమెకు క్రేజ్ తగ్గలేదు. నిజానికి తమన్నాకు డాన్స్ అంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత కాదు చిన్నపటి నుంచే ఇష్టమట. ఈ విషయాన్ని తమన్నా ఇటీవల ఆమె చిన్నతనంలో డాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి షేర్ చేస్తూ చెప్పుకొచ్చింది..ఇకపోతే తమన్నా డాన్స్ చేస్తే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. అంత అందంగా డాన్స్ చేస్తుంది మిల్కీ బ్యూటీ. అయితే ఆమెకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టమట. ఈ విషయాన్ని ఓ పోస్ట్ ద్వారా తెలిపింది తమన్నా.. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ఆ పోస్ట్ లో తమన్నా చిన్నప్పుడు స్టేజీ పై డాన్స్ చేస్తున్న ఫోటో అది. ఆ ఫోటోకు కొనసాగింపుగా సముద్రం ఒడ్డున డాన్స్ చేస్తూ… బాల్యాన్ని గుర్తుచేసుకుంది..తనకు డాన్స్ అంటే ఇష్టమని, డాన్స్ చేయడం తప్ప తనకు మరేది అంత ఆనందం కలిగించలేదని, ఈ ఫోటోతో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయని పోస్ట్ లో పేర్కొంది.. ఇక సినిమాల విషయానికొస్తే..గతేడాది ‘ఎఫ్ 3’, ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి సినిమాల్లో నటించిన తమన్నా ఈ ఏడాది తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమాలో నటించనుంది. ఈ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘జైలర్’ సినిమాలో కూడా నటిస్తోంది తమన్నా. వీటితో పాటు మరో రెండు కొత్త సినిమాలలో నటిస్తుంది.. మరోవైపు వెబ్ సిరీస్ లను చేస్తూ బిజీగా ఉంది.
This throwback reminded me that since childhood nothing made me a happy as dancing to my favourite songs. No matter what happens… just dance!#JeeKardaThrowback
Show me your then and now… I’d love to hear your story.
Watch #JeeKardaOnPrime on June 15 only on @primevideoin pic.twitter.com/fq4lF4zEhA
— Tamannaah Bhatia (@tamannaahspeaks) June 8, 2023
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!