అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమే కానీ, డబ్బు సంపాదించేందుకు మానవ అవయవాలతో వ్యాపారం చేయడం తప్పే కదా. అమాయకులకు డబ్బు ఎరగా చూపి దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు సంచలనం సృష్టిస్తోంది. నిందితుల రిమాండ్ రిపొర్టు లో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. రెండు అక్రమ కిడ్నీ ఆపరేషన్లను గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఒక్కో కిడ్నీ నీ పాతిక లక్షల అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు.…
Madanapalle Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. విశాఖపట్నం నుంచి మదనపల్లికి మహిళలను తీసుకొచ్చిన కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. విశాఖకు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలను మదనపల్లిలో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. అయితే.. కిడ్నీ తొలగించడంతో యమున అనే మహిళ మృతి చెందింది. యమున కుటుంబ సభ్యులు మదనపల్లి టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also: Dubai: దుబాయ్ ఎడారిలో…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా గృహాల గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.. అలాగే సోషల్ మీడియా ప్రతిభావంతులతో కూడా ముచ్చటించనున్నారు. సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు చంద్రబాబు.. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని చిన్నమండెం ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. అధికార…
AP Fake Liquor Case: అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థన్ అరెస్టు చూసేందుకు అనుమతి ఇవ్వాలని తంబళ్లపల్లెలో ఎక్సైజ్ శాఖ పీటీ వారెంట్ దాఖలు చేసింది.
ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు... అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, బోయినపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు..
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీలను ఐబీ అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు ఉగ్రవాదుల నివాసాల్లో మంగళవారం జరిపిన సోదాల్లో భారీగా మందుగుండు సామగ్రి పట్టుబడింది. సిద్ధిక్ నివాసంలో 4 కిలోల ఆర్డీఎక్స్, డిటొనేటర్ వైర్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అలీ నివాసంలో పేలుళ్లకు ఉపయోగించే వైర్లను పోలిసులు గుర్తించారు. గురువారం రాత్రి మరోసారి టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ మన్సూర్…
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేయడంతో అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. ఒకపక్క రాయచోటి పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాలలో పోలీసులు గస్తీ కాస్తుండగా, మరోపక్క టెర్రరిస్టుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
ఓ వివాహిత అదృశ్యం కేసు.. రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రామసముద్రంలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా రామసముద్రంలోని ఎగువపల్లె, శ్రీరాములపల్లి ప్రజల మధ్య వివాహిత అదృశ్యం కేసులో ఘర్షణ చెలరేగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎర్రబోయినపల్లికు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఎస్సై రవికుమార్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
అన్నమయ్య జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు కన్నుమూశారు.. 80 ఏళ్ల పాలకొండరాయుడు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు.. రెండు రోజుల క్రితం అనారోగ్యపాలైన సుగవాసి పాలకొండరాయుడును బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు..
నీటి కుంటలో మునిగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. మొలకలచెరువు మండల కేంద్రానికి చెందిన మల్లేష్ (36), అతని కుమార్తె లావణ్య (12), కుమారుడు నందకిషోర్ (10) కలిసి గ్రామ సమీపంలోని పెద్ద చెరువుకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు.. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు వెళ్లి చెరువులోకి దిగిన నందకిషోర్, అతని స్నేహితురాలు నందిని నీటిలో మునిగిపోతుండగా.. అది చూసిన లావణ్య పెద్దగా కేకలు వేసింది. అంతేకాదు..