పెళ్లి అనేది మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన అధ్యాయం.. ప్రేమ, రాజీ, అవగాహన, గౌరవం తో పాటు దంపతుల మధ్య హెల్దీ రిలేషన్ ఉండాలి. ఇందులో ఏం తక్కువైనా అది మీ రిలేషన్‌ని పాడు చేస్తుంది. అందుకే భార్యాభర్తలు తమ రిలేషన్‌ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.. దాంపత్య జీవితం లో ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పక పాటించాలి..
సాదారణంగా భార్యలు బాధపడుతుంటే అలాంటప్పుడు భర్తలు కచ్చితంగా తమ వెన్నంటే ఉండాలి. ఎలాంటి సందర్బంలోనూ తన చేయిని వదలొద్దు. వారు ఏం చెబుతున్నారో వినండి. వారికి ఏం కావాలో చేయండి.. కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు కాదు మీరు ఇవ్వాల్సింది.. సాయంగా ఉండండి. తను కలత చెందితే కంటికి రెప్పలా చూడండి. ఇది ఎలా ఉండాలంటే మీ ఓదార్పుతో తను ఆ బాధనే మరిచిపోయేలా ఉండాలి.. ప్రేమగా దగ్గర తీసుకోవాలి..పెళ్ళైన కొత్తల్లో కొందరు అడగకుండా అన్నీ కొనిస్తారు.. రోజులు గడిచే కొద్దీ.. దాన్ని మరిచిపోతారు. కానీ, అలా చేయొద్దు. ఒక్కసారి ఇలా చేస్తే మీ కోసం ప్రాణం ఇస్తారు… ఎన్ని సంవత్సరాలైన తమ పార్టనర్ ని అట్రాక్ట్ చేయడం, ఆనందపెట్టడం ముఖ్యం. కాబట్టి, ఏవైనా స్పెషల్ డేస్, అలాంటి సందర్భాల్లో కచ్చితంగా చిన్నవైనా ఇచ్చి స్పెషల్ ప్లాన్ చేసి తనను మరోసారి ప్రేమలో పడేయ్యండి..
పిసినారి తనం ఉండాలి.. కానీ భార్య విషయంలో అస్సలు పెట్టుకోకండి మొదటికే మోసం వస్తుంది.. ఇలాంటప్పుడు మీరు కొన్నింటిని డబ్బుతో కొనలేరు. నచ్చినవి కొనిచ్చి తన కళ్ళలో ఆనందాన్ని చూస్తే దాన్ని మీరు ఎంత డబ్బు పెట్టినా దొరకదని గుర్తుపెట్టుకోండి.. అందుకే అన్ని విధాలా మీరు సుఖ పడాలి అంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.. కొన్ని విషయాల్లో తన తప్పు ఉన్నా పర్సనల్ గా తీసికెళ్లి తనను బుజ్జగించాలి.. సరదాగా వారానికి ఒక్కసారి బయటకు తీసుకెళ్లండి.. ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే వాళ్ళు హ్యాపిగా ఫీల్ అవుతారు.. మిమ్మల్ని సుఖ పెడతారు..