CM Chandrababu: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 17 చేరింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు అయ్యాయి. ఇక, గాయపడిన వారిని అనకాపల్లి, విశాఖపట్నంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఫార్మా సెజ్ లోని ఎసైన్షియా అనే కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పరామర్శించనున్నారు. అలాగే, ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నారు.
Read Also: Brand Value: కంపెనీల క్యూ.. ఒక్కసారిగా పెరిగిన వినేశ్, మను బాకర్ సంపాదన!
అయితే, ఎసైన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదానికి భద్రత వైఫల్యం కారణం అని పోలసులు అంటున్నారు. MTBE అనే గ్యాస్ లీకేజ్, సాల్వెంట్ తో కలవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందన్నారు. గ్యాస్ పేలుడు కారణంగా ప్రొడక్షన్ యూనిట్ గోడలు ధ్వంసం కాగా.. యాజమాన్యం బాధ్యతారాహిత్యం ప్రమాదానికి కారణం అని పేర్కొన్నారు. 381 మంది సిబ్బంది పరిశ్రమలో పని చేస్తున్నారు. ఇక, యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. ఇక, ఫార్మా ప్రమాదంపై పోలీసులు ఎసైన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 106(1), 125(b),125(a) సెక్షన్ కింద కేసులు పెట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో మరణాలకి కారణం , ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం లాంటి సెక్షన్ల కింద రాంబిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.