Off The Record: వైసీపీ ప్రభుత్వ హయాంలో… 2022లో జిల్లాల పునర్విభజన జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల ప్రకారం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి, అమలాపురం కేంద్రంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, మూడోది కాకినాడ జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో…అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉన్న రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు వాసంశెట్టి సుభాష్. ఆయన సొంత నియోజకవర్గం అమలాపురం అయినా… అది…
మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు మంత్రి సుభాష్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్న అమలాపురం ఘటనలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది డబ్బులు తీసుకున్నారు.. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు దాడి చేశారని తెలిపారు.. అయితే, దాడి చేసినవారు. నా అనుచరులు అని వైసీపీ బ్యాచ్.. నా పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్ జగన్ పర్యటన పేరుతో సైకోలతో కలిసి వ్యర్థం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇక, ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగా పసిగట్టి.. వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు మంత్రి వాసంశెట్టి సుభాష్
వైఎస్ జగన్‌కు లండన్ మందులు పనిచేయడం లేదు.. కనీసం, యోగాతోనైనా ఆరోగ్యం సక్కబడుతుంది.. యోగా ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని సలహా ఇచ్చారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. రప్పా రప్పా నరకటం అనే పదాన్ని సినిమాల్లో డైలాగ్‌లుగా చెబుతున్న జగన్.. రౌడీయిజం, హింస ప్రేరేపించేలా నీ పరామర్శ యాత్రలు ఏంటి? అని ప్రశ్నించారు..
యువత పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలని, అందుకు అవసరమైన ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు సద్విని చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. సోమవారం రామచంద్రపురంలోని విజయ్ ఫంక్షన్ హాల్ లో కోనసీమ స్టార్టప్ సమ్మిట్ పేరుతో జరిగిన స్కిల్ డెవలప్మెంట్, పరిశ్రమల స్థాపనపై జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి సుభాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
తనపై ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపకపోతే సివిల్, క్రిమినల్ కేసులు పెడతాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.. అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్స్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు.. అవినీతి కేసులో త్వరలో రాష్ట్ర మాజీ మంత్రి, అతని కుమారుడు అరెస్టు అవుతారు.. వారి అవినీతిని బయట పెడతామని పేర్కొన్నారు.
విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రిని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. గత ఐదేళ్ల పాలనలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారని ఆయన మండిపడ్డారు. సరైన పరికరాలు లేకుండా చేశారని.. ఉద్యోగుల భర్తీని కూడా చేయలేదన్నారు.
గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రానికి ఒక్క ఫ్యాక్టరీ రాలేదు కదా.. రాష్ట్రంలోని 8 ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లాయని ఆరోపించారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. వైసీపీలో ఐదు సంవత్సరాలు పాటు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాని హాట్ కామెంట్లు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్..