Kannappa : మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పిలక, గిలక పాత్రలను బ్రాహ్మణులను అవమానించే విధంగా మంచు మోహన్ బాబు, విష్ణు పెట్టారని.. వాటిని తొలగించకపోతే మూవీని అడ్డుకుంటామని ఇప్పటికే వార్నింగ్ లు ఇస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ రెండు పాత్రలను తీసేసినట్టు ప్రకటించాలని లేదంటే హైకోర్టుకు వెళ్లి మూవీని అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక సంఘం తేల్చి చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలిపాయి.
Read Also : HHVM : అవన్నీ అవాస్తవం.. రిలీజ్ డేట్ పై ‘వీరమల్లు’ క్లారిటీ
ఈ వివాదంపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. మేం ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సినిమాను తీశాం. ఏ ఒక్కరినీ కించపరిచేందుకు తీసిన సినిమా కాదు ఇది. ప్రతి సీన్ తీసే ముందు వేద పండితులు, ఆధ్యాత్మిక వేత్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటూ మూవీని తీశాం. ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు. కేవలం శివుడిపై భక్తిని చాటి చెప్పడమే కన్నప్ప ముఖ్య ఉద్దేశం. సినిమా చూశాక ఆ విషయం అంరికీ అర్థం అవుతుంది. రిలీజ్ కు ముందే మీరు డిసైడ్ అవకండి. రిలీజ్ వరకు ఓపికతో చూడండి’ అంటూ మంచు విష్ణు చెప్పారు.
Read Also : Akhanda 2 Teaser : అఖండ 2 టీజర్ రివ్యూ.. గూస్ బంప్స్ అంతే..