Hepatitis Test: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో హెపాటైటిస్ బీ, సీ వైరస్ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ర్యాండమ్ గా 2, 197 మందికి పరీక్షలు చేయగా.. 205 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, ర్యాండమ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వారికి అమలాపురంలోని ప్రభుత్వ హోస్పిటల్ లో ఏలిసా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ర్యాండమ్ గా కాకుండా గ్రామంలో అందరికి టెస్ట్ లు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, గ్రామంలో దాదాపు 15 వేల జనాభా ఉంది.
Read Also: US B-2 Bombers: ఇండో-పసిఫిక్‌లో మోహరించిన అమెరికా B-2 బాంబర్ విమానాలు
ఇక, హెపాటైటిస్ బీ, సీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే కాలేయంపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు తెలిపారు. లైంగిక సంపర్కం, బ్లడ్ ట్రాన్స్ ఫర్, సూదులు, సిరంజీల ద్వారా హైపాటటీస్ వైరస్ వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు. ఈ కేసులు విస్తరించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వారికి చికిత్స చేస్తున్నారు.