RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా.. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించడంలో వర్మ ముందు ఉంటాడు. ఇక ఈ మధ్యనే ఆర్జీవీ ఒక డెన్ ను నిర్మించిన విషయం తెల్సిందే. ఆర్జీవీ డెన్ పేరుతో ఆఫీస్ ను మొదలుపెట్టిన వర్మ అందులో అమ్మాయిల నగ్న ఫొటోలతో పిచ్చెక్కించాడు. తన దగ్గర వర్క్ చేసి హీరోయిన్లతో పాటు.. హీరోయిన్లు బికినీ వేసుకున్న ఫోటోలను సైతం వాల్ పోస్టర్స్ గా అతికించి షాక్ ఇచ్చాడు. ఇక ఆ డెన్ ను పరిచయం చేస్తూ ప్రతి మీడియా సంస్థకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ .. ఒక ఆసక్తికరమైన విషయాన్నీ పంచుకున్నాడు. ఇప్పుడు విమర్శిస్తున్న పవన్ కోసం గతంలో ఆయన కథ రాసుకున్నాడట. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. తాజాగా ఆ విషయాన్నీ మరోసారి బయటపెట్టాడు.
Ram Charan: చరణ్- ఉపాసన బిడ్డకు జోలపాట.. గిఫ్ట్ ఇచ్చిన కీరవాణి కొడుకు
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఆయనను మీరు కలిశారు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు మీరు చెప్పేవరకు.. ఆయనను కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది అన్న ప్రశ్నకు వర్మ మాట్లాడుతూ.. ” నార్మల్ గా కలిశాను.. ఏదో చిరంజీవి గారు చెప్పారు .. దాని గురించి విన్నాను కానీ, తానొక యాక్టర్ అవుతాడు.. ఇది ఉంది అని నేను అనుకోలేదు. ఇక ఆయనకు ఒక సినిమా ఆఫర్ చేశారు అని కూడా చెప్పారు అన్నదానిక వర్మ చెప్తూ.. ” అది ఒక ప్రొడక్షన్ కోసం అడిగాను.. 1998 లో రిలీజ్ అయిన వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాను అనుకున్నాను. అయితే ఈ కథ పవన్ కు చెప్తే.. లేదండి.. ఇలాంటి రోల్స్ నేను చేయను అని చెప్పాడు” అని వర్మ చెప్పుకొచ్చాడు. ఇక వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాను వర్మ కార్పోరేషన్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో వంశీ దర్శకత్వం వహించాడు. వినీత్, జేడీ చక్రవర్తి హీరోలుగా నటించగా అవని హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ కి నేను కథ చెప్తే, అలాంటి రోల్స్ నేను చేయను అన్నాడు : RGV #RGV #RgvDen #pawankalyan #JanaSena #NTVTelugu #NTVENT pic.twitter.com/lc8np6OxKe
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 19, 2023