సంప్రదాయం ప్రకారం నేటి వరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు.. కానీ, మీరు ఇప్పుడు భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇద్దామని ఇప్పుడు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. CAG అకౌంట్స్ ను నిర్ధారించగలిగేలా PACని రాజ్యాంగంలో చేర్చారు.. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా PAC ఇవ్వడం జరుగుతోందన్నారు
పీఏసీ చైర్మన్ పదవి విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు.. అందుకే తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం అని ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పీఏసీ చైర్మన్ ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న వారికి ఇవ్వలేదని గుర్తుచేశారు.. ఆర్టికల్ 309 ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే ఇవ్వాలని స్పష్టం చేశారు.. అంతెందుకు 1981, 82లో బీజేపీకి ఇద్దరే ఉన్నా వారికే PAC చైర్మన్ ఇచ్చారన్నారు.. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక పర్యాయాలు…