Perni Nani: నందమూరి బాలకృష్ణ, కామినేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. కైకలూరు ప్రజల కష్టాలు పట్టని ఎమ్మెల్యే కామినేని అని.. జనం తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా కామినేనికి పట్టదు. కైకలూరులో దళితులపై జనసేన నేతలు కత్తులతో దాడి చేస్తే మాట్లాడలేదు.. ప్రజల కష్టాల గురించి మాట్లాడటం చేతకానోడు అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు.. 80 ఏళ్లు మీదపడినా కామినేనికి ఇంగితజ్ఞానం లేదు.. ఊరుపొమ్మంటున్నా కాడి రమ్మంటున్నా ఈ వయసులో అసత్యాలు మాట్లాడటం భావ్యమేనా? అంటూ ఫైర్ అయ్యారు.. అర్జంట్ గా మంత్రి అయిపోవాలని కామినేని ఆరాటమని మండిపడ్డారు పేర్ని నాని..
Read Also: Madyapradesh: దారుణం… ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుందో చెప్పకోవంతో భార్య హత్య
ఇక, పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా హెలీకాప్టర్లలో తిరుగుతుండటం బాలకృష్ణ చూడలేకపోతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని.. తన బావతో సమానంగా పవన్ జామర్ కార్లలో తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాడు.. పవన్‌కు చంద్రబాబు ఒంగి ఒంగి సలామ్ కొడుతుంటే కుతకుతలాడిపోతున్నాడు అని విమర్శించారు.. బాలకృష్ణ వల్ల అసెంబ్లీ గేటు దగ్గర కూడా బ్రీత్ ఎనలైజర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. బాలకృష్ణ తప్పతాగి కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు.. అసలు సైకో బాలకృష్ణ.. పవన్ కల్యాణ్‌ను చూసి తట్టుతోలేని సైకో బాలకృష్ణ అంటూ ఫైర్ అయ్యారు నాని.. పురాణాలు, వేదాలు బట్టి పడితే సరిపోదు.. అన్నీ బట్టిపడితే ఇలానే ఉంటుందని సెటైర్లు వేశారు.. బాలకృష్ణ స్వయంగా నాతో ఫోన్ లో మాట్లాడాడు.. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పై ప్రమాణం చేసి చెబుతున్నా.. దమ్ముంటే నువ్వు నీ తల్లిదండ్రులపై ప్రమాణం చెయ్యి బాలకృష్ణ అంటూ సవాల్ చేశారు.. నందమూరి తారకరామారావు, బసవతారకం ఎంత గొప్ప వ్యక్తులు.. అలాంటి వారి కడుపున పుట్టిన నువ్వు ఇంతలా దిగజారిపోవడం సిగ్గుచేటు అన్నారు.. అఖండ సినిమా కోసం బాలకృష్ణ నాకు స్వయంగా ఫోన్ చేశాడు.. జగన్ మోహన్ రెడ్డితో అపాయింట్ మెంట్ ఇప్పించండి అని అడిగారు.. బాలకృష్ణ ఫోన్ చేస్తే నేనే జగన్ మోహన్ రెడ్డికి విషయం చెప్పాను.. వాళ్లు ఏ సాయం అడిగితే అది చేసిపెట్టమని చెప్పిన గొప్ప వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.
వైఎస్సార్ ఎంత సాయం చేశాడో మర్చిపోయావా? బాలకృష్ణ అని ప్రశ్నించారు పేర్ని నాని.. యావజ్జీవ శిక్ష నుంచి తప్పించుకున్న విషయం గుర్తు లేదా? మనిషి జన్మ ఎత్తినవాడెవడైనా చేసిన సాయం మర్చిపోతాడా? జగన్ మోహన్ రెడ్డిని కలవడం ఇష్టం లేకపోతే రావడం మానేయండి.. అంతేకానీ ఎందుకు ఈ సైకో మాటలు ఎందుకు అని ప్రశ్నించారు.. నీ బసవతారకం ఆసుపత్రి ఆరోగ్యశ్రీ బిల్లులు చేయించుకోలేదా? అని నిలదీశారు.. చిరంజీవిని సొంత అన్నలాగా భావించి జగన్ మోహన్ రెడ్డి గౌరవించారు.. మూడు, నాలుగేళ్ల నుంచి ఎన్నో అవమానాలను భరించాం.. చిరంజీవి వెంటనే స్పందించినందుకు సంతోషం అన్నారు.. గతంలో పవన్ కల్యాణ్ నోటికొచ్చినట్లు వాగినప్పుడే చిరంజీవి ప్రకటన చేసుంటే ఇంకా బాగుండేది.. నిజంగా మేం సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టుంటే.. ఎందుకు ఇంకా మేం ఇచ్చిన జీవోలను అమలు చేస్తున్నారు..? ఎందుకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలను కొనసాగిస్తున్నారు? అని మండిపడ్డారు..
అధిక ధరలు పెంచుకుంటూ పోతే సినీపరిశ్రమ దెబ్బతింటుందని జగన్ మోహన్ రెడ్డి ఆనాడే చెప్పారు అన్నారు పేర్ని నాని.. సినిమా ధియేటర్లు మూతపడి కళ్యాణ మండపాలుగా మారిపోతాయి.. ఏడాదికో సినిమా తీస్తే టెక్నీషియన్లు … క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైపోతారని జగన్ ఆనాడే సూచించారు.. సినీ పరిశ్రమ గురించి జగన్ మోహన్ రెడ్డి చాలా గొప్పగా ఆలోచించారు.. సినీపరిశ్రమ మనుగడను కాపాడాలని జగన్ కోరారు.. సినీ పరిశ్రమకు స్థలాలు ఇస్తామన్నారు కదా? జగన్ మోహన్ రెడ్డి ఆలోచనను గౌరవించి చిరంజీవి, రామ్ చరణ్ వైజాగ్ లో స్థలం కొన్నారు.. చంద్రబాబు ఏనాడైనా సినీపరిశ్రమకు మేలు చేశాడా..? చంద్రబాబు సినీపరిశ్రమను తన ఈవెంట్లకు…అడ్వరటైజ్ మెంట్లకు వాడుకున్నాడు.. విదేశాల్లో ఉన్నప్పటికీ చిరంజీవి పెద్ద మనసుతో స్పందించినందుకు ఆయనకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని..