Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉండవల్లిలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నైతిక విలువలతో కూడిన విద్య ఎంతటి కీలకమైనదో చాగంటి కోటేశ్వరరావు మంత్రికి వివరించారు. చిన్ననాటి నుంచే పిల్లలలో మానవీయ విలువలు, క్రమశిక్షణ, నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చాగంటి కోటేశ్వరరావు దిశా నిర్దేశంలో రూపకల్పన చేసిన నైతిక విలువల పాఠ్యాంశాలను నో బ్యాగ్ డే రోజు బోధిస్తున్నారు. నైతిక విలువల విద్యతోనే సమగ్ర విద్యా వికాసం సాధ్యమని నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగం కావడం పట్ల చాగంటి కోటేశ్వరావు సంతోషం వ్యక్తం చేశారు. భేటీ అనంతరం ఇంటి నుంచి కారు వద్దకు వచ్చి చాగంటి కోటేశ్వరావుని వినయపూర్వకంగా సాగనంపారు మంత్రి నారా లోకేష్.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!