AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- రేపు ఏపీ కేబినెట్ సమావేశం..
- ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో భేటీ..
- సీఆర్డీఏ కీలక అంశాలకు అమోదం తెలపనున్న కేబినెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది.. గురువారం రోజు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, సీఆర్డీఏ ప్రతిపాదనలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణం కోసం మొతడక గ్రామంలో 2,340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే పల్నాడు జిల్లాలోని 244.39 ఎకరాల ఇనాం భూములను దేవాదాయ శాఖ నుంచి సీఆర్డీఏకు బదిలీ చేసేందుకు రూ.122 కోట్ల చెల్లింపుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించనుంది.
ఇక, హ్యాపీ నెస్ట్ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ రేరాకు చెల్లించాల్సిన రెన్యువల్ ఫీజును రద్దు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. అదేవిధంగా అమరావతిలో 9 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణం, నగరంలోని 20 ప్రాంతాల్లో 5జీ సెల్ టవర్ల ఏర్పాటు కోసం టెండర్లు పిలవడంకు ఆమోదం లభించే అవకాశం ఉంది. పీపీపీ విధానంలో రోప్‌వే ప్రాజెక్టు అమలు కోసం కన్సల్టెన్సీ నియామకానికి అనుమతి ఇవ్వనున్న కేబినెట్, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా రూ.1,205 కోట్లతో 18 అంతస్తుల రెండు టవర్ల నిర్మాణ పనులను ఎల్ అండ్ టీకి అప్పగించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది.
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
అలాగే కృష్ణా నదిపై విజయవాడ–అమరావతి మధ్య భవిష్యత్తులో అవసరమయ్యే వంతెనల సంఖ్యపై అధ్యయనం చేయడానికి కన్సల్టెంట్ నియామకం, ప్రభుత్వ భవనాల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు, అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు వంటి అంశాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం అమరావతి అభివృద్ధి దిశగా మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!