ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే భర్త భార్యను చంపడం.. లేదా భార్య భర్తను హత్య చేయడం వంటివి చూస్తున్నాము.. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ లో జరిగింది. ఒక చిన్న విషయానికి భర్త తన భార్యను హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్త వివరాల్లోకి వెళితే.. దేవ్, కుసుమ్ కు రేండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఏడాది వయసు ఉన్న బాబు ఉన్నాడు. కుసుమ్ తనకు భర్తకు తెలియకుండా ఫోన్ లో తరచూ మాట్లాడుతుండడంతో.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎవరితో మాట్లాడుతున్నావని భర్త అడిగినా చెప్పకపోవడంతో… కోపంతో రగిలిపోయిన భర్త.. భార్యపై దాడి చేసి హత్య చేశాడు. సింగ్రౌలి జిల్లాలోని ధని గ్రామంలో బుధవారం ఈ సంఘటన జరిగింది.
స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.