Pawan Kalyan South Indian Temples Tour: హైందవ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం.. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు.. తొలి విడతలో ఈ నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నారు.. అయితే, చివరి నిమిషంలో ఆయన పర్యటన వాయిదా పడింది.. పవన్ కల్యాణ్ కు అస్వస్థతకు గురయ్యారు.. వైరల్ ఫీరత్‌తో ఇబ్బంది పడుతున్నారని ఆయన టీమ్ తెలిపింది. పవన్ కళ్యాణ్ ను జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధ పెడుతోందని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారని అన్నారు. అంతే కాదు.. ఆ తర్వాత జరిగిన కేబినెట్ భేటీకి కూడా దూరంగా ఉన్నారు పవన్.. అయితే, ఇప్పుడు జ్వరం నుంచి కోలుకోవడంతో.. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన ఖరారు అయ్యింది..
Read Also: Delhi: బీజేపీ ముఖ్యమంత్రి ‘శీష్ మహల్’ ఉండరు.. అధికారిక వర్గాల సమాచారం
ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభంకానుంది.. ఈ పర్యటనలో మూడు రోజులు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు పవన్ కల్యాణ్.. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పవన్ ఆలయాల సందర్శన కొనసాగనుంది.. ఈ ఆధ్యాత్మిక యాత్రలో.. అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను పవన్ కల్యాణ్ సందర్శిస్తారని ఆయన టీమ్ చెబుతోంది.. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.. కాగా, తొలి విడతలో పవన్ కల్యాణ్ ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పర్యటించాలని నిర్ణయం తీసుకున్నా.. అది వాయిదా పడడంతో.. ఇప్పుడు రెండు రోజులు కుదించి.. మూడు రోజుల్లో తన పర్యటన ముగించేలా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.