ఉత్తర్‌ప్రదేశ్‌లో మహా కుంభమేళా ఎంత ఘనంగా జరుగుతోందో మనకు తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధువులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులతో ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం కిక్కిరిసిపోతోంది. జనవరి 13న ప్రారంభం అయిన ఈ మహా కుంభమేళా.. వచ్చే నెల 26న ముగియనుంది. దీంతో ఈ 45 రోజుల్లో దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.ఇక ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా భక్తులు.. గంగా, యమునా, సరస్వతి సంగమం లో పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే తాజాగా కుంభమేళాలో ఓ హీరోయిన్ సన్యాసం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే
మమతా కులకర్ణి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ 90లలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన హీరోయిన్ లో ఆమె కూడా ఒకరు. అప్పట్లో ఆమె అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది మమతా. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైన మమతా కులకర్ణి, ఇక ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల తర్వాత తిరిగి భారత్‌కి వచ్చింది.
కాగా జనవరి 24న కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర డాక్టర్ లక్ష్మి నారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాస దీక్ష తీసుకుంది. అంతేకాదు మమతా కులకర్ణి నుంచి తన పేరును శ్రీయామై మమత నందగిరిగా మార్చుకుంది. కాషాయ దుస్తులు ధరించి మెడలో రుద్రాక్ష మాల, భుజానికి వేలాడుతున్న జోలె వేసుకుని కనిపిస్తున్న మమతా కులకర్ణి. ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ఇందుకు సంబందించిన ఫోటోలు కొన్ని వీడియోలను స్వయంగా మమతా నే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రజంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.