Minister TG Bharath: ఓ వైపు సంక్షేమంతో పాటు.. మరోవైపు అభివృద్ధిపై దృష్టిసారించింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు సంస్థలు ఏపీకి వస్తుండగా.. మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రం వైపు చూస్తున్నాయి.. అయితే, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు అన్నారు మంత్రి టీజీ భరత్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ భూములు ఇష్టానుసారం పంచుతున్నారు అని దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు.. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. అందుకే కుట్రతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, 20 లక్షల ఉద్యోగాలు.. ఐదేళ్లలో ఇస్తాం.. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు అన్నారు.. డిటైల్డ్.. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటేనే.. ల్యాండ్ అలాట్ అవుతుంది అని స్పష్టం చేశారు.. నిబంధనల తర్వాత సేల్ డీడ్ ఇస్తారు.. ఇష్టారాజ్యంగా భూ కేటాయింపు జరగదని తెలిపారు.. ఊరికే భూ కేటాయింపులు జరగవు.. ఈ వ్యవహారంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు అని సూచించారు మంత్రి టీజీ భరత్..
Read Also: Indian Rupee: డాలర్‌తో పోలిస్తే రికార్డ్ స్థాయిలో రూపాయి పతనం.. భారత్ ఏం పాపం చేసింది..