ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి...భూ సమీకరణ, భూసేకరణ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అమరావతి ప్రాంతంలో రెండో విడత భూసమీకరణ చేయాలనే ఆలోచనతో ఉంది. దీనిపై కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్థానిక రైతులు సానుకూలంగా లేకపోవడంతో...రాజధాని ప్రాంతంలో జరిగే భూ సమీకరణకు బ్రేక్ పడింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయింది... సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమాశేం జరిగింది.. రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూకేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించారు.. సమావేశానికి మంత్రులు నారాయణ, భరత్, అధికారులు హాజరయ్యారు..
Minister Narayana: ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో జరిగిన కీలక నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడిస్తూ.. సీఆర్డీఏ 47వ ఆధారిటీతో పాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం కూడా జరిగిందన్నారు. 2014- 19లో గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కు సంబంధించి రూ. 514 కోట్ల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.
రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు కేటాయించే భూముల విషయంపై ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్ సబ్ కమిటీ.. పలు భూ కేటాయింపులపై ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది..
Cabinet Sub Committee : అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో, రాజధానిలోని పలు సంస్థలకు భూమి కేటాయింపులు చేసే అంశంపై మంత్రుల కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీ, గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనుంది.…