Indian Rupee: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి గురువారం ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈరోజు రూపాయి విలువ 88.37 కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న గందరగోళం కారణంగా భారత రూపాయి పతనం కొనసాగుతోంది. గత వారం నమోదైన 88.36 పాయింట్ల కనిష్ట స్థాయి నుంచి ఇది పడిపోయింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు భారత రుణ, ఈక్విటీ మార్కెట్ల నుంచి నికరంగా $11.7 బిలియన్లను ఉపసంహరించుకున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
READ ALSO: Youtube కంటెంట్ క్రియేటర్లకు పండుగే.. మరింత విస్తరించనున్న మల్టీ లాంగ్వేజ్ ఆడియో ఫీచర్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరలేపిన ప్రతీకార సుంకాల యుద్ధం భారతదేశ వాణిజ్య దృక్పథం, మూలధన ప్రవాహాలపై ప్రభావం చూపడంతో పాటు రూపాయి పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారతదేశం – యునైటెడ్ స్టేట్స్ మధ్య సుంకాల చర్చలలో పురోగతి కోసం వ్యాపారులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో రూపాయి విలువ 88.20 – 87.95 స్థాయిలను దాటి కదలలేకపోయింది. ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్‌తో డాలర్ పనితీరును అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.05% పెరిగి 97.82కి చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.10% తగ్గి బ్యారెల్‌కు $67.42 వద్ద ఉన్నాయి. రూపాయి పతనాన్ని అరికట్టడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వినియోగ పన్ను కోతలను ప్రారంభించారు. అలాగే రెండు దేశాలు కూడా నిరంతర చర్చలను పరిశీలిస్తున్నాయని పలు నివేదికలు తెలిపాయి.
డాలర్లను అమ్ముతున్న ఆర్బీఐ..
అధిక అస్థిరతను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 88.20 స్థాయి చుట్టూ అడపాదడపా డాలర్లను విక్రయిస్తోందని మార్కెట్ శ్రేణులు చెబుతున్నారు. “ఈరోజు ఇది 87.80 – 88.30 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నాము. రాబోయే వినియోగదారుల ధరల సూచిక (CPI) విడుదల – ఫెడ్ ద్వారా పెద్ద వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను నడిపిస్తున్నాయి” అని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ LLP ఒక నోట్‌లో తెలిపింది.
READ ALSO: Nepal: నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో 54 ఏళ్ల వ్యక్తి.. ఇంతకీ ఎవరు ఈయన?