శాసనమండలిలో నూతన పరిశ్రమల స్థాపనపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. ‘రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చెందితేనే పరిశ్రమలు వస్తాయని వైఎస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు. కొవిడ్ సమయంలో కూడా కొత్త పరిశ్రమలు తీసుకువచ్చారు. రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ఉద్యోగ కల్పన జరగాలి. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేయాలి. పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలి’ అని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కోరారు. పీ4 పాలసీలో ఎంతమందిని పారిశ్రామిక వేత్తలుగా…
Minister TG Bharath: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన పరిశ్రమను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పూర్తవ్వలేదు అన్నారు.
వాళ్లు ఇష్టముంటే వాళ్లొస్తారు.. పరిశ్రమలు పెట్టాలనుకుంటే పెడతారు అనేది గత ప్రభుత్వ పాలసీ అని.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేయం.. ఛార్టెడ్ ఫ్లైట్ పెట్టేది లేదని గత ప్రభుత్వం చెప్పేసిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్రంగా విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని ఆ తర్వాత ప్రభుత్వం అందుకోలేకపోయిందని మంత్రి అన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలులో పారిశుధ్యం, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, పచ్చదనంపై మంత్రి భరత్ అధికారులను ఆరా తీశారు. ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దని మంత్రి సూచించారు.