అమరావతి చాలా సురక్షితంగా ఉంది.. భవిష్యత్‌లో కృష్ణా నదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సురక్షితంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు మంత్రి నారాయణ.. వరదల వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన ఆయన.. అనవసర ప్రచారం నమ్మవద్దు అన్నారు..
భారీ వర్షాలు, పోటెత్తిన వరదలతో బెజవాడ నీట మునిగింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మూగజీవాలు చనిపోయాయి. దీనంతటికీ ప్రధాన కారణం బుడమేరు. సహజంగా కృష్ణానది నుంచి విజయవాడకు వరదలు వస్తాయనుకుంటారు. కానీ ఈసారి బుడమేరు బెజవాడను ముంచేసింది. దీంతో అసలు ఈ బుడమేరు ఎక్కడ పుడుతుంది.. ఎక్కడికెళ్తుంది.. బెజవాడకు, దీనికి సంబంధమేంటి.. లాంటి అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. బుడమేరును బెజవాడ దుఃఖదాయినిగా చెప్పుకుంటూ ఉంటారు. పేరుకు తగ్గట్టే ఇది బెజవాడ…