Pawan Kalyan: సినీ హీరోలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల
- సినీ హీరోలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- పవన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ..
- డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్..
- పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిపై కామెంట్స్ చేయరని స్పష్టం..
- చెట్లు పెంచితే సమాజానికి మంచిది అనేదే పవన్ ఆలోచనగా పేర్కొన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: బెంగళూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. సినిమాలలో పాత్రల మీద పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు, అప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు పోషిస్తే.. ఇప్పుడు మాత్రం కుర్ర హీరోలు మాఫియా, స్మగ్లింగ్ పాత్రలు పోషిస్తున్నారు.. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రలు చేస్తే ఇప్పుడు హీరోలు మాత్రం అడవులను నాశనం చేసి చెట్లను నరికి వాటిని స్మగ్లింగ్ చేసే వారిగా నటిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గందదగుడి అనే సినిమా తనకు చాలా ఇష్టమని అడవిని రక్షించడమే ఆ సినిమా కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చారు. డీఎఫ్‌వోగా రాజ్ కుమార్ అడవులను కాపాడే తీరు తనకు అప్పట్లో చాలా బాగా నచ్చిందని పవన్ అన్నారు. అయితే పవన్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్..
Read Also: Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిపై కామెంట్స్ చేయరని పేర్కొన్నారు. చెట్లు పెంచితే సమాజానికి మంచిది అనేదే పవన్ కల్యాణ్ ఆలోచనగా స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. మరోవైపు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి? అని ప్రశ్నించారు.. జగన్ కు ఇంకిత జ్ఞానం ఉండాలి అంటూ ఎద్దేవా చేశారు. మేం సరిగ్గా పరిపాలన కొనసాగిస్తున్నాం.. ప్రతిపక్ష నేత ప్రజా సమస్యల పై మాట్లాడాలి.. తనకు సమస్యలు ఉన్నాయని.. మాట్లాడటం జగన్ మార్చుకోవాలి అని హితవుపలికారు.. ప్రతిపక్ష హోదా పక్కన పెట్టండి.. తాడు బొంగరం లేని పార్టీ.. వైసీపీ అంటూ సెటైర్లు వేశారు.. ఇప్పటికీ ఈసీ రికార్డుల్లో పార్టీకి ఎవరు అధ్యక్షులో క్లారిటీ లేదన్నారు.. జనసేనకు లోక్ సభలో ఇద్దరు సభ్యులు ఉన్నారు.. ప్రజలకు మేలు జరిగేలా పనిచేస్తారు.. రాష్ట్రంలో గత పరిపాలనలో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం కలిగించింది.. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి సహకరించాలని, భరోసా ఇవ్వాలనే భావన వాళ్లలో కనిపిస్తోందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!