Yoga Celebrations: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చక్ర సిద్ధ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మోకిలాలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద పాల్గొని.. చక్ర సిద్ధ వ్యవస్థాపకులు డాక్టర్ సత్య సింధుజతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Narendra Modi : విశాఖపట్నం సాక్షిగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. సముద్రతీరాన లక్షలాది మంది ప్రజలు చేరి యోగాసనాలు చేస్తూ ఈ వేడుకను ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్నారు. 175 దేశాలు…
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సహా ప్రముఖులు హాజరయ్యారు. ఆర్కేబీచ్ నుంచి భీమిలి వరకు కంపార్ట్‌మెంట్స్ ఏర్పాటు చేశారు. యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. Also Read:Neeraj Chopra: జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్…
CM Chandrababu : విశాఖ నగరం ఈ ఉదయం అద్భుత దృశ్యానికి వేదికైంది. అర్బన్ సముద్రతీరాన ఆర్కే బీచ్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ యోగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన యోగాసనాల ప్రదర్శన 45 నిమిషాలపాటు సాగనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతోపాటు స్థానికులు వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రానే వచ్చింది. ప్రపంచ దేశాలు యోగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం 24 గంటల ముందే కౌంట్ డౌన్ మహాత్సవాలు జరుపుకుంటున్నారు. యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. నిత్యం యోగా చేయడం వల్ల ఫిజికల్ హెల్త్ తో పాటు, మెంటల్ హెల్త్ మెరుగవుతుందని భావిస్తుంటారు. అన్ని సమస్యలకు యోగా పరిష్కారంగా చెబుతుంటారు.…
Yoga Day : యోగాను వర్ణించే పతంజలి, ఒక సూత్రంలో “యోగం అంటే మనస్సు , బుద్ధి వృత్తుల నుండి విముక్తి.” ఇలా అంటాడు. మరింత వివరిస్తూ “మనస్సుకు ఐదు వృత్తులు ఉన్నాయి – ప్రతిచోటా న్యాయాన్ని కోరుకోవడం, వాస్తవికతను తప్పుగా గ్రహించడం, ఊహ, నిద్ర , జ్ఞాపకశక్తి.” అని పేర్కొన్నారు. రోజంతా మీ మనస్సు వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్యకలాపాలలో నిరంతరం నిమగ్నమై ఉంటుంది. కానీ రోజులో ఏ సమయంలోనైనా మీరు నిద్రపోకపోతే,…
Yogaday Countdown : జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం రంగురంగుల తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా జూన్ 20న 24 గంటల ముందు కౌంట్‌డౌన్ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిన ఘనత భారత్‌దే అని పలువురు ప్రముఖులు ఈ వేడుకల సందర్భంగా తెలియజేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అందరూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ…
యోగా అందరికీ నేర్పించాలా?.. అంతలా నిధులు ఖర్చుపెట్టాలా? అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ లాగా రాష్ట్రంలో పాలన కనిపిస్తోందని విమర్శించారు. పోలవరం, అమరావతి అలాగే ఉన్నాయని.. కొత్తగా బనకచర్ల వచ్చిందని విమర్శించారు. సంపద సృష్టిలో ఏదైనా ప్రత్యేక ముద్ర వేయాలి కానీ.. కొత్తగా ఏం చేయక్కర్లేదని సూచించారు. మహిళలకు ఉచిత బస్సును తాము స్వాగతిస్తాం అని బీవీ రాఘవులు తెలిపారు. అంతర్జాతీయ యోగా…
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 06 నుంచి 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి. అయితే పరీక్షలు రాస్తున్న టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీనికి గల కారణం ఏంటంటే.. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను వచ్చే నెల 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు…
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 నుంచి జూన్ 21 వరకు ‘యోగాంధ్ర’ పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘పోలీసు యోగాంధ్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. అంతేకాదు యువతీ యువకులు…