Kannada Anchor Aparna Vastare Death: ప్రముఖ కన్నడ నటి, టీవీ వ్యాఖ్యాత అపర్ణ వస్తరే (57) మృతి చెందారు. గత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోన్న అపర్ణ.. గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని అపర్ణ భర్త నాగరాజు వస్తరే సోషల్ మీడియాలో తెలిపారు. అపర్ణకు క్యాన్సర్ నాల్గవ దశలో ఉందని, క్యాన్సర్‌తో పోరాటంలో ఆమె ఓడిపోయిందని చెప్పారు. కన్నడలో ప్రముఖ యాంకర్ అయిన అపర్ణ.. గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాటం చేశారట. అపర్ణ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంతాపం తెలిపారు.
Also Read: Today Gold Price: వరుసగా రెండోరోజు.. భారీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు!
1984లో నటిగా కెరీర్ ప్రారంభించిన అపర్ణ.. డీడీ చందన ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. 7000 షోలకు పైగా యాంకరింగ్ చేసిన ఆమె.. 10 సినిమాల్లో కూడా నటించారు. మసానంద పువ్వు, సంగ్రామం, ఇన్‌స్పెక్టర్ విక్రమ్, డాక్టర్ కృష్ణ, ఒంటి సలగ సినిమాల్లో చేశారు. ముక్త, మూడలమనే, ఇవాలు సుజాత సీరియల్స్‌లో కూడా యాక్టింగ్ చేశారు. మరోవైపు కన్నడ బిగ్ బాస్ సీజన్ 1లో ఆమె కనిపించారు. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో వినిపించే అనౌన్స్‌మెంట్‌కి అపర్ణనే వాయిస్ ఇచ్చారు.