పెళ్లంటేనే సందడి.. హడావుడి ఉంటుంది. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల రాకతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటారు. సామాన్యులు చేసుకున్నా.. భాగ్యవంతులు చేసుకున్నా.. సందడి ఏ మాత్రం తగ్గదు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్లు వివాహ ఏర్పాట్లు చేసుకుంటారు. ఇందులో ఏ మాత్రం తగ్గరు. అయితే ఏం చేసినా.. ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలోనే ఏమైనా చేసుకోవాలి. హద్దులు దాటితే ఒక్కోసారి పరిణామాలు వేరేలా ఉంటాయి. ఇందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే ఉదాహరణ.
ఇది కూడా చదవండి: Road Accident: మాదాపూర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగానికి ఇద్దరు యువకులు బలి..
పెళ్లి మండపంపై భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతోంది. స్టేజ్‌పై వధూవరులు హిందు వివాహ సంప్రదాయ ప్రకారం సాత్ ఫేర్ చేస్తున్నారు. ఇంతలో బంధువులంతా పూల దండలు చింపి కొత్త జంటపై విసురుకొట్టారు. దెబ్బలు తగిలేంతగా బలంగా పూలతో దాడి చేశారు. ఆ పువ్వులు పక్కనే ఉన్న పూజారికి కూడా బలంగా తగిలాయి. దీంతో ఒక్కసారిగా పూజారి కోపోద్రేకానికి గురయ్యారు. చేతిలో ఉన్న ఫ్లవర్ ఫ్లేట్ తీసుకుని బంధువులపై విసురాడు. అంతే ఒక్కసారిగా వాతావరణం కూల్ అయిపోయింది. అప్పటిదాకా సందడిగా సాగిన పెళ్లి తంతు.. ఆ పరిణామంతో అంతా అవాక్కయ్యారు. అనంతరం పూజారితో యువకుడు గొడవ పడినట్లుగా వీడియోలో కనిపించింది. అయితే బంధువులు మరీ మితిమీరి ప్రవర్తించడం వల్లే పూజారి ఈ విధంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు రకరకలుగా కామెంట్లు చేస్తున్నారు. పూజారిని ఒలింపిక్స్ పంపిస్తే.. మెడల్స్ తీసుకురావడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.
Kalesh b/w a Pandit ji and Some Guys over throwing Flower during Marriage Ritual's:
pic.twitter.com/qC3vSabKRj— Ghar Ke Kalesh (@gharkekalesh) December 26, 2024