2024కి బైబై చెప్పేసి.. 2025కి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధం అవుతోంది.. ఇక, కొత్త సంవత్సర వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా రెడీ అవుతోంది.. ధూంధామ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మతో పాటు ప్రఖ్యాత సింగర్లు, నటి నటులతో ఈవెంట్స్ అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతిలో భారీ సెట్లలో నాలుగు గ్రాండ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి.. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అప్పుడే ఈ ఈవెంట్స్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది..