అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీతో పాటు భారతదేశాన్ని సందర్శిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు రెండు దేశాల నాయకులతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Fire Accident : హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన భారతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో బోట్లపై బాణాసంచా కాల్చుతుండగా, అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హుస్సేన్ సాగర్‌లో రెండు బోట్లు మంటల్లో కాలి పోయాయి. ఈ బోట్లలో ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తుండగా, వారందరూ బోట్ల నుంచి…
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సంక్రాంతి సందర్భంగా సీఆర్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో యువకుల మధ్య మాట మాట వచ్చి చిన్న వివాదం చోటు చేసుకుంది.. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీసింది..
2024కి బైబై చెప్పేసి.. 2025కి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధం అవుతోంది.. ఇక, కొత్త సంవత్సర వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా రెడీ అవుతోంది.. ధూంధామ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మతో పాటు ప్రఖ్యాత సింగర్లు, నటి నటులతో ఈవెంట్స్ అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతిలో భారీ సెట్లలో నాలుగు గ్రాండ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి.. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అప్పుడే ఈ ఈవెంట్స్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది..
భారత దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.. ప్రతి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 16 రాష్ట్రాలకు చెందిన బృందాలు తమ కళారూపాలను ప్రదర్శిస్తాయని తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి సదా భార్గవి సోమవారం తెలిపారు.. భార్గవి మాట్లాడుతూ.. పండుగ మొత్తంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి యాత్రికులకు విజువల్ ట్రీట్‌ను అందజేస్తామన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఫెస్ట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా,…
Koti Deepotsavam LIVE day 13th, Karthika Masam Special Live, Koti Deepotsavam, Maha Rudrabhishekam, Karthika Deeparadhana, Swarna Lingodhbavam, Sapta Harathi, Maha Neerajanam, V. C. Sajjanar, Cultural Programs,