రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి రానుంది.. ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్‌కు బస్సులో రానున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సాయంత్రం 4 గంటలకి విజయవాడ బస్టాండ్ లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.. ఇక, ఆయా నియోజక వర్గాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు..
స్త్రీ శక్తి స్కీమ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభంపై ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చెయ్యచ్చు. పల్లె వెలుగు. అల్ట్రా పల్లె వెలుగు... సిటీ ఆర్డినరీ.. మెట్రో.. ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణం చెయ్యచ్చు. ఆంధ్రప్రదేశ్ నివాసులైన మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు – ఐడీ ప్రూఫ్‌తో ఉచిత ప్రయాణానికి అర్హులు.. నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ బస్సులకు ఈ స్కీమ వర్తించదు.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా…