స్త్రీ శక్తి స్కీమ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభంపై ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చెయ్యచ్చు. పల్లె వెలుగు. అల్ట్రా పల్లె వెలుగు... సిటీ ఆర్డినరీ.. మెట్రో.. ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణం చెయ్యచ్చు. ఆంధ్రప్రదేశ్ నివాసులైన మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు – ఐడీ ప్రూఫ్‌తో ఉచిత ప్రయాణానికి అర్హులు.. నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ బస్సులకు ఈ స్కీమ వర్తించదు.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా…
AP Cabinet Meeting: సచివాలయంలో ఇవాళ (ఆగస్టు 6న) ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు.
ఏ ప్రాజెక్ట్ అడిగినా గడ్కరీ అడ్డు చెప్పరని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. మహారాష్ట్ర రవాణా శాఖమంత్రిగా ఉన్నపుడు గడ్కరీ ముంబై, పూణే హైవే నిర్మాణం చేశారని గుర్తు చేశారు. 1997 సమయంలో గొప్ప ప్రాజెక్ట్ నిర్శించారని గుర్తు చేశారు. అభివృద్ధికి నాగరికతకు చిహ్నం రోడ్లు.. వాజ్‌పెయి రోడ్లను అభివృద్ధి చేస్తే మోడీ కొనసాగించారన్నారు.
CM Chandrababu: మహానాడు 2025 సమావేశం ముగిసిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన నేతలతో మాట్లాడుతూ.. కడప మహానాడు అద్భుతంగా జరిగిందని.. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని ఆయన అన్నారు. మహానాడు సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు తెలిపారు. అలాగే కార్యకర్తలకు నా హాట్సాఫ్ అని అన్నారు. Read Also:…
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్‌పై మంత్రుల బృందాన్ని నియమించింది ఏపీ ప్రభుత్వం.. ఈ పథకం అమలుపై సాధ్యాసాధ్యాలు మంత్రుల బృందం పరిశీలించింది.. బాలికలతో సహా మహిళలకు ఉచిత ప్రజా రవాణాను అందించే కర్ణాటక శక్తి పథకం అమలును గుర్తించి, ఏపీ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది.. రవాణా శాఖామంత్రి చైర్మన్ గా, హోంమంత్రి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖామంత్రి సభ్యులుగా, రవాణా శాఖ ప్రధానకార్యదర్శి కమిటీ కన్వీనర్ గా ఉన్నారు..
Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు గ్రామ మాజీ సర్పంచ్ బండి వెంకన్నదే బాధ్యత అని, మల్లేపల్లి గ్రామం చాలా మంచి గ్రామం అందుకే కలెక్టర్ ఈ గ్రామాన్ని ఎంచుకున్నారని, ఖమ్మం జిల్లా అన్ని సంక్షేమ పథకాల అమలు అధికారులు బాగా చేస్తున్నారని సీఎం దగ్గర ఉందన్నారు. ఇందిరమ్మ…
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు నుండి గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండడంతో అక్కడికి వెళ్లి అధికారుల…
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.. మహిళల ఫ్రీ బస్సు స్కీమ్ అమలులో ఉన్న రాష్ట్రాలలో పర్యటించడానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీ రవాణా శాఖ మంత్రి చైర్మన్‌గా.. హోంమంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఈ కమిటీ సభ్యులుగా చేర్చింది ప్రభుత్వం..
ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాయి.. ఆయా ప్రభుత్వాలు.. దీనిపై విపక్షాలు కొన్ని విమర్శలు చేసినా.. ఉచిత బస్సు ప్రయాణంతో.. బస్సుల్లో మహిళల రద్దీ మాత్రం పెరిగిపోయింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వైపు అడుగులు పడుతున్నాయి.. దీనిపై ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మహిళలకు ఉచిత…
తాము చెప్పినట్లుగానే అన్ని పనులూ చేస్తున్నామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి స్పందించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంశంపై అధ్యయనం చేస్తామని.. ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు తీరును పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు.