CM Chandrababu: పెరిగిన క్రైమ్ రేట్..! శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం కీలక ఆదేశాలు..
- కలెక్టర్ కాన్ఫెరెన్స్ లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- యూరియా అంశంలో కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం..
- వదంతులు సృష్టించి శాంతిభద్రతల సమస్య తీసుకురావాలనే ప్రయత్నం..
- అత్యుత్తమ పనితీరు.. టెక్నాలజీ సాయంతో..
- క్రైం రేట్ తగ్గించడంలో ముఖ్యమైనవన్న సీఎం చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కలెక్టర్లు.. ఎస్పీలతో కలిసి శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు.. యూరియా కొరతకు సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చింది.. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని.. తప్పుడు ప్రచారం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు.. అనవసర అసత్య ప్రచారం చేసారన్నారు… అమెరికా నుంచి కూడా వందల్లో పోస్టింగ్స్ పెట్టారన్నారు. ఇలాంటి వాటినే రియల్ టైమ్ గవర్నెన్సులో విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలన్నారు చంద్రబాబు.. క్రైమ్ రేట్ 4 శాతం మేర, సైబర్ క్రైమ్ 16 శాతం పెరిగిందని చెబుతున్నారని.. శాంతిభద్రతల విషయంలో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు.. డ్రగ్స్ నివారణపై ఇంకా ప్రచారం పెరగాలన్నారు.. గంజాయి వినియోగం అరికట్టేలా మరింత ఫోకస్ పెట్టాలని.. గంజాయి రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేలా నిఘా పెంచాలన్నారు. డ్రగ్స్ ను ఓవర్ నైట్ నియంత్రించాలి అనుకోవటం సరికాదని… అదో నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు.. సీసీటీవీ కెమెరాలు భద్రతా పర్యవేక్షణకు ఉపయోగపడతాయన్నారు. నియంత్రణ లేకపోవటం వల్లే 90 శాతం మేర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు చంద్రబాబు.
Read Also: Mirai: ఫ్యామిలీతో మిరాయ్ చూసిన బాలయ్య!
Also Read
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..!
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
సైబర్ క్రైమ్ లో ప్రజలు నెలకు రూ.30 కోట్ల మేర కోల్పోతున్నారని.. క్రిమినల్స్ టెక్నాలజీ మాస్టర్లుగా ఉన్నారన్నారు.. వారికంటే అడ్వాన్స్‌గా మనవాళ్లు మారాలన్నారు సీఎం చంద్రబాబు.ఫోరెన్సిక్స్ కూడా మరింత సమర్ధవంతంగా ఉండాలన్నారు. క్రైమ్ జరిగిన తర్వాత ఎంత సమయంలోగా ఘటనా స్థలికి వెళ్లగలుగుతున్నారు, క్రైమ్ సీన్ ప్రోటెక్షన్ ఎలా జరుగుతోందన్నది కూడా ముఖ్యం అన్నారు సీఎం చంద్రబాబు.. పోలీసు డాగ్స్ శిక్షణ, ప్రతీ రెవెన్యూ డివిజన్ లో డాగ్ స్క్వాడ్ ఉండాలన్నారు. క్రైమ్ సీన్ సైట్ ను డెస్ట్రాయ్ చేయటం పెద్ద నేరమన్నారు.. వివేకా హత్యకేసు అతిపెద్ద ఘటన. ఒక సీఐ దగ్గరుండి రక్తం కడిగించటం ఏమిటని ప్రశ్నించారు.. అప్పట్లో ఆ వివరాలను ఎవరూ నా నోటీసుకు తేలేకపోయారన్నారు చంద్రబాబు..
Read Also: Pakistan: మధ్యవర్తిత్వానికి భారత్ ఒప్పుకోలేదు.. ట్రంప్ వాదనలపై పాక్ మంత్రి సంచలనం..
అంతర్గత భద్రత అనేది ఇప్పుడు ఓ అంశంగా మారిపోయిందని.. దీనిపైనా దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ఇంటెలిజెన్స్ నిఘా మరింతగా పెరగాలని.. టూరిజం రావాలి అంటే భద్రత ఉండాలన్నారు చంద్రబాబు. జిల్లాల్లో బ్యాండ్ విడ్త్ పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఆర్టీజీఎస్ తో లింక్ చేసి సమాచారం ప్రభుత్వం నుంచి ఇస్తామన్నారు సీఎం.. అవేర్ ద్వారానూ 42 పారామీటర్లలో సమాచారం పోలీసులకు అందేలా చేస్తాం అన్నారు. సింగపూర్ లో విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్.. టెక్నాలజీ అందిపుచ్చుకుని మనం అదే స్థాయికి వెళ్లాలన్నారు చంద్రబాబు. క్రైమ్ కన్విక్షన్ రేట్ ను పెంచాల్సి ఉందని.. లా ఆండ్ ఆర్డర్ లో నో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్ ప్రభుత్వ విధానం అన్నారు.. సుగాలీ ప్రీతి కేసును ఇప్పుడు సీబీఐకి పంపించామని.. పాత సెన్సిటివ్ కేసులు వెలికితీయాలన్నారు..
ఇక, గత ప్రభుత్వంలో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్, చంద్రయ్య హత్యకేసు, అమర్నాథ్ గౌడ్ కేసు వంటివాటిల్లో బాధితులకు న్యాయం చేయాలన్నారు చంద్రబాబు. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ విస్తృతం కావాలని.. సీరియస్ క్రైమ్ ను 50 శాతానికి తగ్గించగలిగామన్నారు.. ఈ విషయంలో కొందరిని గట్టిగా డీల్ చేసి నేరస్తుల్లో భయం తేవాలన్నారు. గత ఏడాది కంటే ఈసారి 30 శాతం నేరాల రేటు తగ్గేలా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలన్నారు. అలాగే ప్రజల్లో సంతృప్త స్థాయి పెరగాలని. మనసుపెట్టి పనిచేస్తే అన్నీ సాధ్యమే అన్నారు.. శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదని.. గతంలో కమ్యూనల్ వయలెన్స్ విషయంలో తాను స్పాట్ కు కూడా వెళ్లానన్నారు సీఎం చంద్రబాబు. గంటలోగా క్రైమ్ సీన్ కు వెళ్లగలిగితే నేరాలకు పాల్పడేందుకు నేరస్థులు ఎవరూ ధైర్యం చేయలేరన్నారు. లా అండ్ ఆర్డర్ లో ఫర్మ్ నెస్ ఉంది అనే భావన ప్రజల్లో ఉండాలన్నారు సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!