Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యశ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో రిలీజ్ కానుంది. ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ: ‘కేజీఎఫ్’ తర్వాత మీకు థాంక్స్ చెప్పడానికి కూడా నేను ఇక్కడికి రాలేదు. పనిలో నిమగ్నమైపోయాను. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజాయితీ, సంకల్పంతో పని చేస్తే ప్రేక్షకులు ఎవరినైనా సపోర్ట్ చేస్తారని మీరు నిరూపించారు. సినిమాకు సరిహద్దులు లేవు. భాషను, సరిహద్దులను మించి మానవత్వం ఉంది, ప్రేమ ఉంది, నిజాయితీ ఉంది అని మీరు చూపించారు. అలాగే కర్ణాటకలో కూడా మేము తెలుగు ప్రజలను సినిమాలని ఎంతగానో ఇష్టపడతాం. మన ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయిలో నిలబడాలి. మనందరం కలిసి ఇండియన్ సినిమాను గ్లోబల్ సినిమాలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలి. మీరందరూ యువత. మీరు అనుకున్నది మనసులో బలంగా సంకల్పించుకుని ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాలను సాధిస్తారు. ముందుగా మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. మీపై నమ్మకంతో పనిచేయండి. ఇతరుల మాటలను పట్టించుకోకండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది.
Also Read
- Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
- TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
- Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
‘టాక్సిక్’ సినిమా గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాకు ఇండియా నుంచి బెస్ట్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పనిచేశారు. ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా ఎఫర్ట్ పెట్టారు. మీరందరూ ఇండియన్ సినిమా కోసం కలిసికట్టుగా రావాలని కోరుతున్నాను. మన ఇండియన్ సినిమా గురించి మనం గర్వపడేలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ‘కేజీఎఫ్’కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఆహర్నిశలు ఈ సినిమా కోసం పనిచేశారు. ‘కేజీఎఫ్ 2’ సమయంలో దిల్ రాజు గారితో మాకు పరిచయం ఏర్పడింది. ఆయన చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. నిజంగా ఆయనకు చాలా మంచి దిల్ ఉంది. ఆయనతో కలిసి ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా ఆడియన్స్‌కు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం.
కేవీఎన్ గారు ఇండస్ట్రీకి డబ్బు సంపాదించడానికి రాలేదు. ఫిలిం ఇండస్ట్రీకి తన వంతు సహకారం అందించాలని వచ్చారు. బెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌గా మైల్స్టోన్ సినిమాలను నిర్మిస్తున్నారు. హుమా ఖురేషి ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించారు. కియారాతో మరోసారి ఆడియన్స్ ప్రేమలో పడిపోతారు. రుక్మిణి వసంత్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. తను ప్రతి ఇండస్ట్రీలోనూ అద్భుతమైన సినిమాలు చేస్తోంది. లేడీ సూపర్‌స్టార్ నయనతార గారు ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. ‘టాక్సిక్’ పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను. ఇంతకంటే అద్భుతమైన సినిమాలు చేస్తాను. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని అన్నారు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!