Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..!
- వికసిత్ భారత్‌కు యువతే వెన్నెముక..
- అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు..
- 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..
- యువతకు గోవా సీఎం కీలక సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pramod Sawant: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. దేశంలో దాదాపు 50 శాతం మంది యువత ఉన్నారని, వారి శక్తి, ప్రతిభను సరైన దిశలో వినియోగిస్తే వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలా? వస్తే ఎప్పుడు రావాలి? అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారిందని ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాల్లోకి రావడానికి ముందు అనుభవం, స్థిరత్వం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. 40 ఏళ్ల వయసు తర్వాత రాజకీయాల్లోకి రావడం మంచిదని, ముందుగా జీవితంలో అనుభవం, స్థిరత్వాన్ని సాధించుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని సూచించారు.
వికసిత్ భారత్‌కు యువశక్తి, నారీశక్తి, కిసాన్ శక్తి, గరీబ్ కళ్యాణ్ నాలుగు ప్రధాన మూలస్తంభాలని ప్రమోద్ సావంత్ అన్నారు. గతంలో దేశంలోని ఎంతోమందికి బ్యాంకు ఖాతాలు కూడా లేవని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం జనధన్ ఖాతాల ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి ప్రజలను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5G కనెక్టివిటీ కూడా అందుబాటులోకి వచ్చిందని, దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారత్ వికసిత్ భారత్ 2047 లక్ష్యం వైపు అడుగులు వేస్తోందని సావంత్ అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో యువతదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల్లోకి రావడమే కాకుండా దేశ అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనలోనూ యువత భాగస్వాములు కావాలని సూచించారు.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి ప్రణీత్ రైతులకు సహాయం చేసేందుకు శ్రీకాకుళంలో పనిచేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు ప్రమోద్ సావంత్… ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా యువత పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్తున్నారని ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో యువత కూడా భాగస్వాములు కావాలని అన్నారు. దేశానికి పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న యువత చాలా అవసరమని సావంత్ తెలిపారు. కేవలం రాజకీయాల్లోకి ప్రవేశించడం కాకుండా మంచి పాలసీలను రూపొందించగలిగే స్థాయికి యువత ఎదగాలని సూచించారు. సమాజంలో మార్పు తీసుకురావడంతో పాటు ఫలితాలు సాధించేలా పనిచేసే యువత అవసరమన్నారు. భవిష్యత్తులో యువత ఎంట్రప్రెన్యూర్లు, పాలసీ మేకర్లు, రాజకీయ నాయకులుగా ఎదగాలని ప్రమోద్ సావంత్ ఆకాంక్షించారు. దేశం కోసం బాధ్యతతో పనిచేసే, పారదర్శకతను పాటించే, ప్రజల పట్ల నిబద్ధత కలిగిన యువతే భారత్‌ను ముందుకు తీసుకెళ్లగలదని ఆయన అన్నారు. యువశక్తిని సరైన విధంగా వినియోగించుకున్నప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారం అవుతుందని పేర్కొన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!