64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
- ఫిలిప్స్ కొత్త S7221 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల
- 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్
- 64MP ఆటోఫోకస్ మెయిన్ కెమెరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Philips S7221 5G: ఫిలిప్స్ (Philips) స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. తాజాగా ఫిలిప్స్ S7221 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గతంలో వచ్చిన S7220 5Gకి కొనసాగింపుగా వచ్చిన ఈ కొత్త ఫోన్లో ప్రీమియం డిజైన్‌తో పాటు అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లను అందించారు. ముఖ్యంగా 64MP కెమెరా, కొత్త 5G ప్రాసెసర్, పెద్ద డిస్ప్లే, 5,700mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
డిస్ప్లే:
ఫిలిప్స్ S7221 5Gలో 6.67 అంగుళాల IPS LCD డిస్ప్లేను అందించారు. ఇది HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. అయితే రిఫ్రెష్ రేట్ 60Hzకే పరిమితం చేశారు. ఫోన్ ముందు భాగంలో పెద్ద డిస్ప్లే ఉండగా.. వెనుక భాగంలో స్క్వేర్ ఆకారంలోని కెమెరా మాడ్యూల్‌ను అందించారు. గత మోడల్‌తో పోలిస్తే కొత్త S7221 5Gకు మరింత ప్రీమియం ఫినిష్ ఇచ్చారు. వెనుక భాగంలో ప్రధాన కెమెరాతో పాటు మరో సహాయక లెన్స్‌ను స్క్వేర్ మాడ్యూల్లో అమర్చారు.
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
కెమెరా & ప్రాసెసర్:
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 64MP ఆటోఫోకస్ కెమెరాను అందించారు. ఈ కెమెరాకు f/1.179 అపెర్చర్ ఉన్నట్లు సమాచారం. కెమెరా మాడ్యూల్లో ప్రత్యేకమైన వృత్తాకార ఫ్లాష్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు Unisoc T8200 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ పవర్ అందిస్తుంది. TSMC 6nm ప్రాసెస్‌పై రూపొందిన ఈ చిప్సెట్ బడ్జెట్ విభాగంలో మంచి పనితీరును అందించేలా రూపొందించారు. N1, N3, N28, N41, N77, N78 వంటి పలు 5G బ్యాండ్లకు ఇది సపోర్ట్ చేస్తుంది.
బెంచ్‌మార్క్ వివరాల ప్రకారం Unisoc T8200 AnTuTu 11లో సుమారు 7,57,199 పాయింట్లను సాధించినట్లు సమాచారం. Geekbench 6లో సింగిల్-కోర్ టెస్ట్‌లో 885 పాయింట్లు, మల్టీ-కోర్లో 2,392 పాయింట్లు, GPU టెస్ట్‌లో 2,236 పాయింట్లు సాధించినట్లు తెలుస్తోంది.
బ్యాటరీ:
ఈ కొత్త మొబైల్ లో 5,700mAh బ్యాటరీను అందించారు. దీనికి 9V/2A స్టాండర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే USB Type-C పోర్ట్ అందించారు. అయితే ప్రత్యేకమైన 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఇందులో లేదు. Philips S7221 5G మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సిల్వర్/టైటానియం గ్రే, డార్క్ బ్లూ/నేవీ, బ్లాక్ కలర్ వేరియంట్లు ఉన్నాయి.
ధర ఎంత?
ప్రస్తుతం Philips S7221 5G ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. గతంలో విడుదలైన Philips S7220 ధర సుమారు రూ.15,000గా ఉంది. దీంతో కొత్త S7221 5G ధర కూడా ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉండనుంది. అయితే అధికారిక ధరపై ఇంకా స్పష్టత లేదు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!