Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huma Qureshi: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ హ్యూమా ఖురేషీ.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. తనపై, ‘టాక్సిక్’ టీమ్‌పై చూపిస్తున్న ప్రేమ, ఆదరణను చూసేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రేమ, రెస్పాన్స్ ప్రత్యక్షంగా చూడటానికి రావాల్సిందే అనిపించింది. ‘టాక్సిక్’ టీమ్ తరఫున అందరికీ థాంక్యూ. మా దర్శకురాలు గీతు మోహన్‌దాస్ ఇక్కడ లేకపోవడం బాధగా ఉంది. ప్రస్తుతం సినిమా పనులకు సంబంధించిన ముఖ్యమైన బాధ్యతలతో ఆమె బిజీగా ఉన్నారు’’ అని చెప్పారు. గీతు మోహన్‌దాస్ తనను ఈ పాత్ర కోసం సంప్రదించినప్పుడు.. తాను ఒక చరిత్రలో భాగం కాబోతున్నానని అప్పుడు తెలియదని హ్యూమా తెలిపారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం నిజంగా అద్భుతమైన అనుభవం. యశ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సినిమాను మార్చాలనే విజన్, ధైర్యం ఆయనకు ఉన్నాయి. ‘టాక్సిక్’ చాలా కాలం గుర్తుండిపోయే సినిమా అవుతుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు.
తన ఎలిజబెత్ పాత్ర గురించి ఎక్కువ విషయాలు చెప్పలేనని హ్యూమా ఖురేషీ అన్నారు. ట్రైలర్లో కనిపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉన్నాయని, తన పాత్ర గురించి ఎక్కువగా చెప్పకపోవడానికి కారణం కూడా అదే అని తెలిపారు. ‘‘నేను సినిమాలో చిన్న భాగమే. కానీ కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు మేమేం సృష్టించామో నాకే నమ్మశక్యంగా అనిపించలేదు. అసలు అనుభవం కోసం థియేటర్లలో సినిమా చూడాల్సిందే’’ అని పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్‌పై హ్యూమా ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌కు వచ్చి ఇంతటి ప్రేమను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వెండి తెరపై చూడాల్సిన అనుభవమే ‘టాక్సిక్’ అని, తెలుగు ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా హ్యూమా ఖురేషీ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘‘నేను ఇప్పటివరకు తెలుగు సినిమా చేయలేదని బాధగా ఉంది. కానీ ఇక దాన్ని మార్చాలి. చాలా త్వరలోనే తెలుగు సినిమాలో కనిపిస్తాను’’ అని ప్రకటించారు. దీంతో హ్యూమా ఖురేషీ త్వరలోనే నేరుగా తెలుగు సినిమాలో నటించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!