AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది రాష్ట్రంలోని కూటమి సర్కార్.. 2026 జాబ్ క్యాలెండర్లో భాగంగా మొత్తం 10,060 ప్రభుత్వ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండో దశలో భాగంగా సెప్టెంబర్ 15న 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో గ్రూప్-1 కేటగిరీలో 149 పోస్టులు ఉన్నాయి. అలాగే పోలీస్ శాఖలో 542 కానిస్టేబుల్ పోస్టులు, 182 సివిల్ ఎస్ఐ పోస్టులను ఈ దశలో భర్తీ చేయనున్నారు.
ఆ తర్వాత అక్టోబర్ 15న మూడో దశలో 2,311 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో గ్రూప్-2లో 673 పోస్టులు ఉన్నాయి. అలాగే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు సంబంధించి 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తో పాటు ఇతర విభాగాల్లో మరో 1,638 పోస్టులు ఈ దశలో ఉన్నాయి. ఇక అక్టోబర్ 15న నాలుగో దశలో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలోనే 2,991 పోస్టులు ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కూడా భారీగా అవకాశాలు లభించనున్నాయి.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
మొత్తంగా 2026 జాబ్ క్యాలెండర్లో నాలుగు దశల్లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే తొలి దశ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబర్ 15 నుంచి రెండో దశ, అక్టోబర్ 15 నుంచి మూడో, నాలుగో దశల నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థుల్లో ఆశలు పెరిగాయి.
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!