Mirai: తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి కలెక్షన్స్ వర్షం కూడా కురుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల చేరువలోకి వచ్చేసింది. హిందీలో కూడా కలెక్షన్స్ జోరుగా సాగుతూ ఉండడంతో, మరిన్ని వసూళ్లు చేస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాని తాజాగా నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీతో కలిసి వీక్షించారు.
Dog Squad: గంజాయి రవాణా, సరఫరాకు చెక్..! రంగంలోకి డాగ్ స్క్వాడ్
హైదరాబాదు ప్రసాద్ లాబ్ లో నందమూరి బాలకృష్ణ కుటుంబం కోసం ఒక ప్రత్యేక ఏర్పాటు చేసింది సినిమా టీం. ఈ సందర్భంగా బాలకృష్ణ తో పాటు ఆయన భార్య, కుమార్తెలు ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కి హాజరయ్యారు. తేజ హీరోగా నటించిన ఈ సినిమాలో రితిక నాయక్ కీలక పాత్రలో నటించింది. జగపతి బాబు, శ్రీయ జయరాం వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉన్నట్లుగానే సినిమా ఎండింగ్‌లో ప్రకటించాడు దర్శకుడు. మిరాయ్ పార్ట్ 2 టైటిల్ కూడా అప్పుడే అనౌన్స్ చేశారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
North Korea: కిమ్ కోపానికి కరిగిపోయిన ఐస్ క్రీం.. దెబ్బకు పేరు మారిపోయింది…