CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
- ప్రజా వేదికలో సీఎం కీలక ప్రసంగం
- విజయనగరంలో పార్టీ నేతలతో భేటీ
- విశాఖలో బ్రిక్స్ సదస్సుకు హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఒకే రోజు అనకాపల్లి, విజయనగరం , విశాఖపట్నం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు , అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం నుంచి అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రతిష్ఠను చాటడం వరకు ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అనకాపల్లి జిల్లాలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ , ప్రజా వేదిక
ముఖ్యమంత్రి పర్యటన వివరాల ప్రకారం, ఆయన శనివారం ఉదయం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. అనంతరం ఏ.కొడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ‘ప్రజా వేదిక’ ప్రాంగణానికి చేరుకుని మధ్యాహ్నం 1:15 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారు.
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
విజయనగరం పర్యటన.. ఆపై విశాఖలో ‘బ్రిక్స్’ అంతర్జాతీయ సదస్సు..
అనకాపల్లి జిల్లా పర్యటనను ముగించుకుని, ముఖ్యమంత్రి విజయనగరం జిల్లా ఎస్.కోటకు వెళ్తారు. సాయంత్రం 4:20 గంటల సమయంలో స్థానిక ఎమ్మెల్యే కె.లలితకుమారి నివాసానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం బయలుదేరుతారు. విశాఖలోని నోవాటెల్ హోటల్లో సాయంత్రం 5:05 గంటలకు ప్రారంభమయ్యే ‘రెండో బ్రిక్స్ (BRICS) యువజన, క్రీడల మంత్రుల సమావేశం–2026’కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు.
విశాఖపట్నంలో అంతర్జాతీయ సదస్సు కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు రాత్రికి తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఒకే రోజులో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు , అంతర్జాతీయ దౌత్య పరిణామాలను సమన్వయం చేస్తూ సీఎం సాగిస్తున్న ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?