Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rukmini Vasanth: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు అందిస్తున్న ఎనర్జీ, ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. ‘టాక్సిక్’ టీజర్, ట్రైలర్‌ను ఇప్పటికే ప్రేక్షకులు చూసారని, సినిమాలోని ప్రతి పాత్రకు గీతు మోహన్‌దాస్ అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ఇచ్చారని రుక్మిణి ప్రశంసించారు. ట్రైలర్, టీజర్లోనే భారీ స్థాయి విజువల్స్ కనిపిస్తున్నాయని, సినిమాలోని రిలేషన్షిప్స్ ప్రేక్షకులకు హృదయానికి హత్తుకునేలా ఉంటాయని అన్నారు. అదే సమయంలో భారీ స్కేల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు.
యశ్‌తో కలిసి పనిచేయడంపై స్పందిస్తూ.. ‘‘రాకింగ్ స్టార్ యశ్ సర్‌తో కలిసి పనిచేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఇది నాకు బకెట్ లిస్ట్ మూమెంట్. ఆయనతో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం’’ అని రుక్మిణి వసంత్ కొనియాడారు. కియారా, హ్యూమా ఖురేషీ, తారా, నయన్, అక్షయ్, సుదేవ్ తదితరులతో కలిసి పనిచేయడం కూడా ఎంతో సంతోషంగా ఉందన్నారు. సినిమాకు సంగీతం అందించిన రవి బస్రూర్, విశాల్ మిశ్రా సహా మొత్తం టీమ్ అద్భుతమైన సంగీతాన్ని అందించిందని ప్రశంసించారు. ఆగస్టు 26న థియేటర్లలో ‘టాక్సిక్’ను ప్రేక్షకులు తప్పకుండా చూసి ఆదరించాలని ఆమె కోరారు. తెలుగు సహా అన్ని భాషల్లో వస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?