CM Chandrababu: గుడ్‌న్యూస్..! నెల రోజుల్లో 3 లక్షల కుటుంబాలకు గృహప్రవేశాలు
- వచ్చే ఏడాది మార్చి కల్లా 10 లక్షల ఇళ్ల నిర్మాణం..
- నెల రోజుల్లో 3 లక్షల కుటుంబాలకు గృహప్రవేశాలు..
- ఇళ్లులేని పేదలను గుర్తించేందుకు 15 రోజుల్లో సర్వే..
- గృహ నిర్మాణ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల నిర్మాణం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి.. టిడ్కో ఇళ్లకు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు… రాష్ట్రంలో ఇంకా ఇళ్లులేని పేద కుటుంబాలను గుర్తించి జాబితా రూపొందించాలని ఆదేశించారు. దీనిపై 15 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేద కుటుంబాలకు ఇస్తామన్న హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలన్నారు. పెద్ద కుటుంబాలకు ఉమ్మడి ఇళ్లు నిర్మించే యోచన చేయాలన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పూర్తి చేసేందుకు విడతల వారీగా నిధులు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని… ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి… వీటిలో 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు. సంక్రాంతి కల్లా మరో 2 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. సంక్రాంతి కి 1 లక్షా 83 వేల టిడ్కో ఇళ్లు అందుబాటులో కి తెస్తామన్నారు మంత్రి నారాయణ.
Read Also: Harish Rao : కాళేశ్వరం కూలలేదు.. సీఎం రేవంత్ రెడ్డి మైండ్ దొబ్బింది
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
రాష్ట్రానికి పీఎంఏవై అర్బన్… బీఎల్సీ, పీఎంఏవై గ్రామీణ. ప్రాంతాల ఇళ్లు… పీఎం జన్మాన్ కింద మొత్తం 18 లక్షల 59 వేల 504 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో ఇప్పటికి 9 లక్షల 51,వేల 351 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలోనే 2 లక్షల 81 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వచ్చే నెలలో ఇంకో 19 వేల ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది కాలంలో గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2,013.50 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిన మొత్తం 4,305 లేఅవుట్లలో… రహదారులు, డ్రైనేజీలు తదితర మౌలికవసతుల కోసం రూ.3,296.58 కోట్ల వ్యయం కానుంది. కుప్పం నియోజకవర్గంలో 4,647 మంది గృహ నిర్మాణ లబ్దిదారులకు రూ.16.37 కోట్లు చెల్లించగా, రాష్ట్రంలోని 2,73,709 మంది లబ్దిదారులకు రూ.919.29 కోట్లు త్వరలో చెల్లించనుంది. పీఎం జన్మాన్ కింద నిర్మించిన 15,753 ఇళ్లకు రూ.100 కోట్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద నిర్మించిన 15,582 ఇళ్లకు రూ.75 కోట్ల నిధులు మంజూరు చేయనుంది. మరోవైపు పీఎంఏవై అర్బన్ కింద ఇళ్లు మంజూరైనప్పటికీ 1,84,510 మంది లబ్దిదారులు ఇంకా గృహ నిర్మాణం చేపట్టలేదని అధికారులు ముఖ్యమంత్రికి వెళ్లడించారు.
Read Also: Jaish-e-Mohammed fundraising: బీభత్సానికి నిధుల సేకరణ.. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రసంస్థ కొత్త ప్లాన్
2018లో 104 పట్టణ స్థానిక సంస్థల్లో 4,54,706 టిడ్కో ఇళ్లకు టెండర్లు పిలవగా, వీటిలో ప్రస్తుతం 1,77,546 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిలో 300 చ.అ. విస్తీర్ణం కలిగిన 45,848 ఇళ్లు, 365 చ.అ. విస్తీర్ణం ఉన్న 12,550 ఇళ్లు, 430 చ.అ. విస్తీర్ణం ఉన్న 25,172 ఇళ్లు… మొత్తం 83,570 ఇళ్లను లబ్దిదారులకు ప్రభుత్వం అందించింది. మరో 84,094 టిడ్కో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరింది…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..