Minister Anagani Satya Prasad: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తున్నాం అన్నారు.. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు పేదల సొంతింటి కల సాకారం అవుతున్న చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు.. ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా…
Minister Narayana: భూ సంస్కరణలు, అందరికీ ఇళ్లు అంశాలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘాల సమావేశాలు తాజాగా జరిగాయి. ఈ రెండు విడివిడి సమావేశాలకు మంత్రులు నారాయణ, అనగాని సత్య ప్రసాద్, ఫరూక్, పార్థసారథితో పాటు అధికారులు హాజరయ్యారు. సమావేశాల అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014-19 మధ్య 7 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని.. వీటిలో 5 లక్షల ఇళ్లకు పాలనా అనుమతులు…
రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని... ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి... వీటిలో 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు.
టిడ్కో ఇళ్లపై లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మాట్లాడుతూ.. లబ్ధిదారులకు దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని వెల్లడించారు.. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు వచ్చినా.. ఉన్నా.. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నాం అని తెలిపారు.
వచ్చే జూన్ నాటికల్లా మిగిలిన టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందరికీ అప్పగించేలా పనులు జరుగుతున్నాయన్నారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్టీఆర్ టిడ్కో గృహాల సముదాయ కాలనీ ప్రాంతంలో, నర్సాపురం ప్రధాన కాలువపై రూ. రెండు కోట్లతో వంతెన నిర్మాణానికి మంత్రులు సత్య కుమార్ యాదవ్, రామానాయుడు శంకుస్థాపన చేశారు.
7 లక్షలకు పైగా ఇళ్లు టిడ్కోలో మంజూరు అయ్యాయి. 4 లక్షలకు పైగా ఇళ్లకు టెండర్లు పిలిచాం.. వాటిలో గత ప్రభుత్వం కొన్ని ఇళ్లు రద్దు చేసిందని మండిపడ్డారు మంత్రి నారాయణ.. కేవలం గత ప్రభుత్వం 57 వేల ఇళ్ల నిర్మాణం చేసింది.. టిడ్కో ఇళ్లలో మంచి సౌకర్యాలు ఉన్నాయి. రోడ్లు. పార్కులు. స్కూళ్లు.. షాపింగ్ కాంప్లెక్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు మంత్రి పొంగూరు నారాయణ.. త్వరలోనే లబ్దిదారుల సమస్యలు పరిష్కరించేలా ముందుకెళ్తున్నాం అన్నారు.. శాసనమండలిలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్సీలు తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ.. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం 5546.48 కోట్లు రుణం వివిధ రూపాల్లో తీసుకుందన్నారు.. టీడీపీ ప్రభుత్వం 5 లక్షల ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతులిస్తే వాటిని 2,61,660కు తగ్గించేసిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.. అయితే, టిడ్కో ఇళ్ల అంశంపై సభలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. టిడ్కో ఇళ్ల లోన్లు ఒక నెల వాయిదా వేయాలని బ్యాంకులకు లేఖ రాశామని తెలిపారు.. హడ్కో నుంచీ రుణం ప్రభుత్వమే తీసుకుని టిడ్కో రుణాలు తీరుస్తాం అని వెల్లడించారు.
ప.గో జిల్లా పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ, నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలకొల్లు పట్టణంలో ప్రసిద్ధి చెందిన పురాతన రక్షిత మంచినీటి విభాగం పనితీరును మంత్రి నారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. రామగుండం పార్కు, ఎన్టీఆర్ కళాక్షేత్రం, ఎన్టీఆర్ టిడ్కో గృహాలను పరిశీలించారు.