CM Chandrababu: ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ ప్రజలకు అందిస్తున్నాం అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 26వ తేదీ నుంచి తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించామన్నారు. సాధారణ సభ్యత్వ రుసుము ఎప్పటిలాగా రూ.100 ఉంటుందని.. ఈ ఏడాది నుంచి కొత్తగా లైఫ్ టైం సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నాం.. దీని రుసుము రూ.1,00,000 గా నిర్ణయించామన్నారు.
ప్రజాప్రతినిధులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని స్పష్టం చేసిన ఆయన.. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారని తెలిపారు.. అయితే, చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది.. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా.. సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరించారు.
ఈ రోజు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోన్న ఆయన.. సాయంత్రం 5 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే గడపనున్నారు.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎంపీలు కూడా పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చలు జరగనున్నట్టుగా తెలుస్తోంది..
TDLP Meeting: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై టీడీఎల్పీలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు పూర్తి స్థాయిలో సబ్జెక్టులను ప్రిపేరై రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలను సభలో ప్రస్తావించేలా స్టడీ చేసి రావాలని చంద్రబాబు సూచించనున్నారు. బయట చేస్తున్న దుష్ప్రచారాన్నే వైసీపీ సభలో కూడా చేస్తే గట్టి కౌంటర్లివ్వాలని టీడీపీ…
అమరావతిలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే అంశంపై రేపటి సభలోనూ పట్టు పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇవాళ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, స్పీకర్ తమ్మినేని కామెంట్లపై సమావేశంలో చర్చించారు.