Mangoes Procurement: మామిడి కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి.. ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు..!
- మామిడి కొనుగోళ్లపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి..
- మంచి ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు..
- ఇప్పటి వరకూ 3.08 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోళ్లు..
- రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కేజీ రూ.12 లకు కొనుగోలు..
- కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు రోజువారీ సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mangoes Procurement: తోతాపురి మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకూ 3,08,261 మెట్రిక్ టన్నుల మేర తోతాపురి మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు తమ సామర్ధ్యం మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45 వేల మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోళ్లు జరిగాయి. ర్యాంపులు, మండీల ద్వారా మరో 81 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. మొత్తం 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
Read Also: Bhuvanagiri: అబార్షన్లకు అడ్డాగా మారిన భువనగిరి..? గాయత్రి ఆసుపత్రిపై SOT పోలీసుల సోదాలు..!
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
మొత్తంగా మామిడి రైతులకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.. మూడు జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మామిడి కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. రోజువారీగా మామిడి రైతుల నుంచి ఏ మేర కొనుగోళ్లు జరిగాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మొత్తంగా ఈ సీజన్ లో 3,75,000 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే కుప్పంలో మామిడి రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులుతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు, పల్ప్ పరిశ్రమల యాజమాన్యాలకు దిశా నిర్దేశం చేశారు. రైతుల నుంచి యూనిట్ సామర్ధ్యం మేరకు మామిడి కాయలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆదేశించారు.
Read Also: Tollywood : లక్ అంటే ఇలా ఉండాలి.. జాక్ పాట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్
రైతులకు అదనంగా కేజీకి రూ.4 రూపాయల మద్దతు ధరను ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కేజీకి రూ.8 చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా రైతులకు కేజీ మామిడికి రూ.12 ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పల్ప్ పరిశ్రమల వద్ద గత ఏడాది మిగిలి పోయిన ఉత్పత్తిని విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లే ఆగ్రో, కోకోకోలా, పెప్సీ తదితర సంస్థలు రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతును ఆదుకునేందుకు వీలుగా కేంద్రం రూ.130 కోట్లను విడుదల చేయాలని గతంలోనే లేఖ రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!