లవ్ టుడే సినిమాతో దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని తొలిసినిమాతో హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథ్. ఇక రెండవ సినిమా డ్రాగన్ సినిమాతో వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోగాను రికార్డు క్రియేట్ చేసాడు. దాంతో ప్రదీప్ కు ఆఫర్స్ క్యూ కట్టాయి.ప్రస్తుతం లవ్ ఇన్సురెన్స్ కంపెనీ, డ్యూడ్ అనే మరో యూత్ ఫుల్ సినిమా కూడా చేస్తున్నాడు. డ్యూడ్ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
Also Read : Mrunal Thakur : 6ఏళ్లుగా ఒక్క హిట్ లేదు.. అయినా ఆఫర్స్ తగ్గడం లేదు
కోలీవుడ్ స్టార్ దర్శకురాలు సుధాకొంగర వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన కీర్తిశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది డ్యూడ్. అయితే ఈ సినిమాతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు జాక్ పాట్ తగిలింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డ్యూడ్ డిజిటల్ రైట్స్ ను రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. దాదాపు రూ. 20 నుండి రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న డ్యూడ్ కేవలం డిజిటల్ రైట్స్ తోనే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇంకా మ్యూజిక్ మరియు శాటిలైట్ ఉండనే ఉన్నాయి. ఇక థియేటర్ లో హిట్ టాక్ వస్తే ఆక్కడ నుండి వచ్చేది అంతా లాభమే. సో ఎలా చూసుకున్న మైత్రీ మూవీస్ కు డ్యూడ్ తో జాక్ పాట్ కొట్టినట్టే అని చెప్పాలి. షూటింగ్ దశలోనే టేబుల్ ప్రాఫిట్ సినిమా అంటే ఈ నిర్మాతకైనా అంతకు మించిన ఆనందం ఏముంటుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న డ్యూడ్ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది.