సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే పోస్ట్ ల పై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.. మంత్రులు వంగలపూడి అనిత, నాదెళ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథిలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది కూటమి సర్కార్.. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది..
Keerthy Suresh : కీర్తి సురేష్ వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రెచ్చిపోతోంది. తనప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. సినిమాలు మాత్రం ఆపట్లేదు. వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే తెలుగు సినిమాలో మెరిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. Read Also : Tollywood : కార్మికుల…
సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అసలు, సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి ఏ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో ఆ వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్య, అభ్యంతరకరమైన పోస్టులు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందించారు. ఈ కేసులకు నేనే భయపడడం లేదు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆర్జీవీ. మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వర్మపై అభ్యంతరకర పోస్టుల కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, రామ్ గోపాల్ వర్మ తన సినిమా వ్యూహం ప్రచారం సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని తక్కువచేసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అలాగే, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్…
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు పోలిసులు.. ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్ర శేఖర్ పెట్టిన పోస్ట్‌లపై స్థానిక టీడీపీ నేత కిషోర్ ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు.. సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయి అంటూ మండిపడ్డ ఆయన.. సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద ఇస్తాను సారంగా మాట్లాడుతున్నారు.. వారి జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం జరుగుతుంది.. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను దెబ్బతీసేలా కూడా పోస్టులు పెడుతున్నారట.. అయితే, ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా వస్తున్న కొన్ని సోషల్ మీడియా పోస్టింగులపై చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.. ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దనే రీతిలో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిపై నిఘా పెట్టింది సర్కార్.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఆర్‌పీఎస్ అధికారిణిగా ఎంపికైన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. తండ్రి ఓం బిర్లా పలుకుబడి ఉపయోగించి అంజలి ఉద్యోగం సంపాదించిందని.. యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గుకు రాగలిగారని నెటిజన్లు ట్రోల్స్ చేశారు.
Election Code: కొందరు ఇతరులను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్ట్‌లు చేస్తుంటారు. మరికొందరు ఆ పోస్టులపై కామెంట్లు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.