PV Sunil Kumar: ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అతడిపై సస్పెన్షన్‌ను మరోసారి పొడిగించింది.. మరో 6 నెలల పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లారని ఇప్పటికే సస్పెండ్ చేసింది ప్రభుత్వం.. అభియోగాలు నిరూపణ కావడంతో సునీల్ కుమార్ ను గతంలో సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం..
Read Also: Medipally Murder Update: స్వాతి హత్య కేసు.. సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్
అయితే, మరో రెండు రోజుల్లో సస్పెన్షన్ గడువు ముగియనుండటంతో సమీక్షించిన రివ్యూ కమిటీ.. మరో ఆరు నెలలు సస్పెన్షను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. అగ్రి గోల్డ్ నిధులు దుర్వినియోగంపై పీవీ సునీల్ కుమార్ పై ఏసీబీ విచారణ కొనసాగుతోంది.. రఘు రామకృష్ణంరాజును వేధించిన కేసులో దర్యాప్తు చేస్తున్నారు గుంటూరు నగరపాలెం పోలీసులు.. సస్పెన్షన్ ను ఎత్తేస్తే సాక్ష్యాధారాలు, దర్యాప్తును ప్రభావితం చేస్తారని నివేదించింది రివ్యూ కమిటీ.. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున మరో 6 నెలలు సస్పెండ్ చేయాలన్న సిఫార్సు చేసింది.. దీంతో, తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్..