Kollywood Actress : ఈ నడుమ సెలబ్రిటీల ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం కామన్ అయిపోయింది. అయితే కొన్ని సార్లు అవి వల్గర్ కూడా ఉంటున్నాయి. తాజాగా ఓ కోలీవుడ్ నటికి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ శృతి నారాయణన్ ప్రైవేట్ వీడియోపై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. ఈ వీడియోలో.. ఆమె ఓ ప్రైవేట్ ఆడిషన్ ఇస్తున్న టైమ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నట్టు ఉంది. దాన్ని ఎవరో వీడియో తీశారు. అది ఇప్పుడు లీక్ అయింది. ఆ వీడియో లీక్ అయిన కొన్ని గంటల్లోనే భారీగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 14 నిముషాల పాటు ఆ వీడియో ఉంది. అయితే ఈ వీడియోపై శృతి మాత్రం స్పందించలేదు.
Read Also : Kannappa: అంత నమ్మకం ఉంటే ఈ శాపాలెందుకు?
కానీ కొన్ని గంటల క్రితం తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను ప్రైవేట్ గా మార్చుకుంది. మళ్లీ ఏమైందో తెలియదు గానీ.. పబ్లిక్ గా మార్చుకుంది. అయితే ఆ వీడియో నిజంగానే శృతి నారాయణన్ దేనా లేదంటే ఫేక్ వీడియోనా అనేది మాత్రం తెలియదు. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియకుండా పోయిందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక వీడియో లీక్ అయిన తర్వాత తాజాగా ఆమె చీరకట్టులో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ అవుతోంది.